Home / latest ap news
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన సమయంలో గొప్ప ఆసక్తి కర సంఘటన జరిగింది . మంత్రులు ప్రమాణస్వీకారం అనంతరం వెళ్లి పోతున్న మోదీ వెనుదిరిగి పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదిక దగ్గరు వెళ్లారు.
కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో అన్న క్యాంటీన్లకు మళ్లీ కళొచ్చింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం పేదల కోసం అన్నక్యాంటీన్లు ప్రారంభించింది. 5 రూపాయిలకే పేదలకు, నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించింది.
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన జనసేన పార్టీ శాసనసభ్యులు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెనాలి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును ప్రతిపాదించారు.
ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు విజయవాడ ఏ కన్వెన్షన్‌లో భేటీ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా విశాఖ చేరుకున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో విశాఖ చేరుకున్న పవన్ అక్కడనుంచి అనకాపల్లి వెళ్లి నూకాంబికా అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
తెలుగు దేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావడంతో.. అమరావతికి పునర్ వైభవం రానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు కలల రాజధాని అమరావతిని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక మరుగున పడేసింది. దాంతో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టక ముందే.. చెట్టు, ముళ్ల కంపలతో నిండిపోయిన రాజధానిని అధికారులు శుభ్రం చేసే పనిలో పడ్డారు.
ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటోంది. 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు
పీ ప్రజలకు కొత్త ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం విధించిన చెత్త పన్నును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పట్టణాలు, నగరపాలక సంస్థలకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
రెడ్ బుక్..ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రెడ్ బుక్...ఈ పేరు వింటేనే ఇప్పుడు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రెడ్ బుక్ పేరు వినగానే వైసీపీ నేతలు భయంతో వణికిపోతున్నారు. రెడ్ బుక్ సిద్ధమైందంటూ ఏపీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
వైసీపీ నాయకుడు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొడాలి నాని ఇంటిని ముట్టడించేందుకు తెలుగు యువత ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.