Home / latest ap news
ఏపీకి చీకటి రోజులు ముగిశాయని, ఇది ఏపీ భవిష్యత్‌కు బలమైన పునాది వేసే సమయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఏపీ అసెంబ్లీ ఫలితాలు ఆశ్చార్యాన్ని కలిగించాయని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఎంతో చేసినా వారి ప్రేమలు ఏమయ్యాయో తెలియలేదన్నారు. ఏపీ ప్రజలకోసం ఎంతో చేయాలని తాపత్రయ పడ్డాం.
ఏపీ అసెంబ్టీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ దుమ్మురేపింది. జనసేన పార్టీ పోటీ చేసిన 21 సీట్లను గెలుచుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు కూడా జనసేన ఈ స్దాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఊహించలేదు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలు తారుమారు చేసాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలకు, కార్యకర్తలకు పార్టీ పరాజయం మింగుడు పడటం లేదు. తమ పార్టీ అమలు చేసిన సంక్షేమ పధకాలతో ప్రతీ కుటుంబం లబ్దిపొందిందని అందువలన గతంలో వచ్చిన సీట్లు రాకపోయినా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని నమ్మారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి దూసుకు పోతోంది. అధికార వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి కనబడడంలేదు .ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం సీట్లల్లో 10 శాతం గెలవాలి.ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు వున్నాయి
ఏపీ లో ప్రజల నాడీ ఏ సర్వే సంస్థలకు చిక్కలేదు మిశ్రమ ఫలితాలను అందించాయి అన్ని ఎగ్జిట్ పోల్స్ .కొన్ని ఏకపక్షంగా వైసీపీ కి అనుకూలంగా ఉంటే ,మరి కొన్ని సంస్థలు కూటమికి అనుకూలంగా ఫలితాలు వుంటాయని ప్రకటించాయి
Former MP Undavalli Comments: ఉమ్మడి రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడిచిన సందర్భంగా ఏపీలో తాజా పరిస్థితిపై సీనియర్ రాజకీయ వేత్త ,మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంటే ఏపీ పరిస్థితి మాత్రం దశాబ్ది ఘోష అన్నట్లు తయారయ్యిందని వ్యాఖ్యానించారు . 2014 నుండి 2024 వరకు ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి ఇప్పటి జగన్, […]
AP CEO instructions:ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అవాంతరాలు కలిగించేందుకు యత్నించే వారిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించి వేయాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించే వారిని, ఆర్వో ఆదేశాలను పాటించడంలో విఫలమైన […]
పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ వాదనలను సుప్రీమ్ కోర్ట్ తోసిపుచ్చింది .దీనితో సుప్రీంకోర్టులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది . పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వైసీపీ వేసిన కేసును సుప్రీం కోర్టు కొట్టేసింది
వైసీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. కౌంటింగ్ రోజు పిన్నెల్లిని కౌంటింగ్ సెంటర్ వద్దకు వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయట ఉంటే తనకు ప్రాణహాని ఉందని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరి రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.