Home / latest ap news
దాదాపు రెండు నెలలు ఎన్నికల ప్రహసనం శనివారంతో ముగిసింది .ఇక రాజకీయ రాజకీయ పార్టీలకు గెలుపుఓటమి పై గుబులు పట్టుకుంటుంది .ఈ క్రమంలో వివిధ మీడియా సంస్థలు చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ సాయంత్రనికి వచ్చాయి .దింతో కొందరికి మోదం కొందరికి ఖేదంగా మారింది .
ఏపీవ్యాప్తంగా మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దింతో జూన్ 3 నుంచి జూన్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం షాపులు మూతపడనున్నాయి. రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
విదేశీ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్నారు సీఎం జగన్ . ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం యూరప్ యాత్రకు వెళ్లారు జగన్ . చంద్రబాబు కూడా దుబాయ్ అటు నుంచి అమెరికా వెళ్లి వచ్చారు .
గత ఐదు రోజులుగా విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం వలన ఇప్పటికి 9 మంది మరణించారు . అతిసారం ఇంకా అదుపులోకి రాలేదు. తాజాగా మరోకరు మరణించడంతో అతిసార లక్షణాలతో మృతి చెందిన వారి సంఖ్య 9కి చేరుకుంది
ఏపీలో ఎండల తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు ఎక్కువ సమయాన్ని ఇళ్ళల్లోనే గడుపుతున్నారు .పైగా చల్లదనం కోసం ఏసీలు ఎక్కువగా వాడుతున్నారు . దింతో విద్యుత్ వినియోగం పెరిగింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది . పోస్టల్ ఓట్లలో సంతకం,సీల్ లేకపోయినా ఓట్లు చెల్లుతాయన్న గతంలో సీఈఓ ముకేశ్ కుమార్ మీనా చెప్పిన సంగతి తెలిసిందే .
: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. వైసీపీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు సజ్జల పై కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు.
ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు ఊరట దక్కింది. ఏబీవీపై ఉన్న సస్పెన్షన్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటన్నట్లు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ ఇవాళ్టితో ముగియనుంది.. సాయంత్రంతో ఆయన రిటైర్డ్ కాబోతున్నారు.
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరాచకాలపై టీడీపీ నేతలు విరుచుకు పడ్డారు . ఏకంగా ఒక పుస్తకాన్ని విడుదదల చేసారు . ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దారుణాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.