Home / keerthy suresh
Dasara Making Video: నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం దసరా. ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. దీంతో ఈ చిత్ర విజయోత్సవ సందర్భంగా.. చిత్రం మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
Dasara Teaser: నాని నటించిన తాజా చిత్రం 'దసరా' ఈ చిత్ర టీజర్ నేడు విడుదలైంది. ఇప్పటికై ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఈ సినిమా టీజర్ ను రాజమౌళి విడుదల చేశారు. తమిళంలో ధనుష్.. హిందీలో షాహిద్ కపూర్.. మళయాళంలో దుల్కర్.. కన్నడలో రక్షిత్ శేట్టి ఏకకాలంలో విడుదల చేశారు.
జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్ తెలుగు, తమిళం మరియు మలయాళ భాషలలో చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో నాని యొక్క దసరా మరియు మెగాస్టార్ చిరంజీవి యొక్క భోళా శంకర్ షూటింగ్లో ఉంది . అంతేకాదు ప్రస్తుతం రెండు తమిళ ప్రాజెక్ట్‌లతో కూడా బిజీగా ఉంది.
తాజాగా ఈ సినిమా మేకర్స్ కీర్తి సురేష్ సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ‘బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన’..అనే క్యాప్షన్‌తో ఒక వీడియోను ట్వీట్ చేసింది.పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో కీర్తి నటించినట్లు గ్లింప్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది.బ్యాగ్రౌండ్ స్కోరును ఫోక్ సింగర్ కనకవ్వ అలపించినట్లు తెలుస్తుంది.
కీర్తి సురేష్ 'మహానటి' సినిమాతో తెలుగులో ఎంత పాపులర్ అయ్యిందో మన అందరికీ తెలిసిన విషయమే. సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ మలయాళీ ముద్దుగుమ్మ మహానటి సినిమాకు ఉత్తమ నటిగా ఎంపికై నేషనల్ అవార్డును కూడా అందుకున్నారు.