Home / France
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్‌ను నియమించారు. సోమవారం రాజీనామా చేసిన ఎలిసబెత్ బోర్న్ తర్వాత, ఆధునిక చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఫ్రెంచ్ ప్రధానమంత్రిగా అతను రికార్డుకెక్కారు. అంతేకాదు అట్టల్ ఫ్రాన్స్‌లో మొట్టమొదటి గే ప్రధాన మంత్రి.
'మానవ అక్రమ రవాణా' అనుమానంతో 300 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో నికరాగ్వాకు వెళ్తున్న విమానాన్ని ఆపిన ఫ్రెంచ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై భారతీయ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు .
: ఫ్రాన్స్ .. పర్యాటకులకు మరియు ప్రేమ పక్షులకు ప్రసిద్ధి చెందిన దేశం... ఇపుడు మనుషుల రక్తాన్ని తాగే బెడ్‌బగ్స్ ను తొలగించడానికి కష్టపడుతోంది. ఇవి గత కొన్ని వారాలుగా వీటిని ప్రజలు వీటిని బట్టలు, బ్యాక్‌ప్యాక్‌లు లేదా డైనింగ్ టేబుల్‌పై - సబ్‌వేలు, సినిమా ధియేటర్స్ వద్ద చూస్తున్నారు.
విదేశీ విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ శుభవార్త చెప్పింది. 2030 నాటికి భారత్ నుంచి 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌ను సందర్శించిన దాదాపు నెల రోజుల తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ ప్రకటన చేశారు.
పారిస్‌లోని సబర్బన్ ప్రాంతమైన నాంటెర్రేలో డెలివరీ డ్రైవర్‌ను ఒక పోలీసు అధికారి కాల్చి చంపిన తర్వాత ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు మూడవ రోజుకు చేరుకున్నాయి, ఈ నేపధ్యంలో పోలీసులు దేశవ్యాప్తంగా 400 మందిని అరెస్టు చేశారు.
76 వ కేన్స్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లో అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలబ్రిటీస్ సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై హోయలు పోయారు. రెండు రోజు వేడుకల్లో భాగంగా హీరోయిన్ మృనాల్ ఠాకూర్ పాల్గొంది. ఫ్యూజన్ లుక్ లో కనిపించిన మృనాల్ తన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దేశీ గర్ల్ ఫీల్ వస్తుందంటూ క్యాప్షన్ పెట్టింది.
ఫ్రాన్స్‌లో పెన్షన్ సంస్కరణలకు వ్యతిరేకంగా తొమ్మిదవ రోజు నిరసనలు జోరందుకున్నాయి. ఒక మిలియన్ మందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఒక్క పారిస్‌లోనే కనీసం 119,000 మంది ఉన్నారు.
ఫ్రాన్స్‌లో ట్రేడ్ యూనియన్లు మంగళవారం నాడు దేశవ్యాప్తంగా సమ్మకు పిలుపునిచ్చాయి వివాదాస్పదమైన పెన్షన్ సంస్కరణలను దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు
Fifa World Cup 2022 : ఫుట్ బాల్ ప్రపంచకప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలిచింది. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఛాంపియన్ గా అర్జెంటీనా అవతరించింది. ఫిఫా వరల్డ్ కప్ టైటిట్ ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. అర్జెంటీనా జట్టు ప్రపంచ విజేతగా నిలవడంతో ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కల సాకారం అయ్యింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా […]
ఫ్రెంచ్ అధ్యక్షుడు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని 18 నుంచి 25ఏళ్లలోపు యువతకి ఫార్మసీలు ఉచితంగా కండోమ్స్ అందించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఆ దేశ యువతలో ముందుగానే న్యూయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ దేశ అధ్యక్షుడే ఇంతటి నిర్ణయం ప్రకటించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ఓ సారి తెలుసుకుందాం.