France protests: ఫ్రాన్స్ .. దేశవ్యాప్తంగా నిరసనలు.. 400 మందికి పైగా అరెస్టు చేసిన పోలీసులు
పారిస్‌లోని సబర్బన్ ప్రాంతమైన నాంటెర్రేలో డెలివరీ డ్రైవర్‌ను ఒక పోలీసు అధికారి కాల్చి చంపిన తర్వాత ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు మూడవ రోజుకు చేరుకున్నాయి, ఈ నేపధ్యంలో పోలీసులు దేశవ్యాప్తంగా 400 మందిని అరెస్టు చేశారు.

France protests: పారిస్‌లోని సబర్బన్ ప్రాంతమైన నాంటెర్రేలో డెలివరీ డ్రైవర్‌ను ఒక పోలీసు అధికారి కాల్చి చంపిన తర్వాత ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు మూడవ రోజుకు చేరుకున్నాయి, ఈ నేపధ్యంలో పోలీసులు దేశవ్యాప్తంగా 400 మందిని అరెస్టు చేశారు.
40,000 మంది పోలీసుల మోహరింపు..(France protests)
ఫ్రాన్స్ యొక్క పోలీసు విభాగం రైడ్ ను బోర్డియక్స్, మార్సెయిల్ మరియు లియోన్‌తో సహా అనేక ప్రధాన నగరాల్లో మోహరించారు. పెరుగుతున్న అశాంతిని అణిచివేసేందుకు దేశవ్యాప్తంగా 40,000 మంది పోలీసులను మోహరించాలని ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ ముందుగా ప్రణాళిక వేసింది.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 421 మందిని అరెస్టు చేసినట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ దర్మానిన్ తెలిపారు. ఈ అరెస్టులలో ఎక్కువ భాగం పారిస్‌లో జరిగాయి. బుధవారం పోలీస్ స్టేషన్లు, టౌన్ హాళ్లు, పాఠశాలలకు నిప్పుపెట్టిన 150 మందిని అరెస్టు చేశారు.
నాయెల్ మరణం నాన్‌టెర్రే వీధుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. నివాసితులు బారికేడ్‌లకు నిప్పంటించారు, బస్ స్టాప్‌ను పడగొట్టారు. పోలీసులపై బాణసంచా కాల్చారు. పరిస్థితిని సద్దుమణిగించేందుకు పోలీసులు టియర్ గ్యాస్, చెదరగొట్టే గ్రెనేడ్లను ప్రయోగించారు.ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ బుధవారం ఈ సంఘటనను ‘వివరించలేనిది మరియు క్షమించరానిదిగా వర్ణించారు. ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి:
- Dog Nanny Job: కుక్కలను చూసుకునే ఉద్యోగం.. జీతం అక్షరాల కోటి రూపాయలు..!
- BJP Central Cabinet Expansion: కమలదళంలో సంస్థాగత మార్పులు.. త్వరలో రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు