Home / FIFA
ఫిఫా ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదైంది. సాకర్ టోర్నీలో పసికూనలైన జట్లు ఏ మాత్రం తమకు పోటీ కాదని భావించే డిఫెండింగ్ చాంపియన్‌కు షాక్ ఇచ్చింది. తాజాగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ ను ట్వునీషియా జట్టు నేలకరిపించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఈ సాకర్ టోర్నీ వేదికగా ఎంతో మంది ప్రజలు, ప్లేయర్లు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ క్రమంలోనే అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ చేసిన ఓపని ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది.
ఖతార్ వేదికగా ఫుట్ బాల్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా టోర్నీ జరుగుతున్న స్టేడియంకు దగ్గర్లో నేడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
ఖతార్ వేదికగా ఫిఫా ప్రపంచకప్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జపాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్ ఫొటో కోసం జర్మనీ ఆటగాళ్లు వినూత్న రీతిలో ఫోజ్ ఇచ్చారు. ఫొటో తీసే ముందు ఒక్కసారిగా తమ కుడి చేతులతో నోళ్లను మూసుకున్నారు. ఎందుకిలా అనే ప్రశ్న మీకు కలిగింది కదా అయితే ఈ కథనం చూసేయ్యండి.
ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో అతి పెద్ద సంచలనం నమోదైంది. వరల్డ్ నెంబర్-3 జట్టు అయిన అర్జెంటీనాను ఆసియా పసికూన అయిన సౌదీ అరేబియా (51వ ర్యాంకు) ఓడించింది. అంతేకాకుండా వరుసగా 36 మ్యాచ్ ల్లో గెలిచి టైటిల్ ఫేవరేట్‌గా ప్రపంచ కప్ బరిలోకి దిగిన మెస్సీ సేన దూకుడుకు సౌదీ అడ్డుకట్ట వేసింది.
ఖతార్ వేదికగా ఫిఫా పురుషుల ప్రపంచ కప్ ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యింది. ఆరంభ మ్యాచ్ లో ఈక్వెడార్ 2–0 తేడాతో ఆతిథ్య ఖతార్ జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా ఈక్వెడార్ ఆటగాళ్లను సపోర్ట్ చెయ్యడానికి వచ్చిన ప్రేక్షకులు ‘మాకు బీర్లు కావాలి’ అంటూ గోలగోల చేశారు.
నేటి నుంచి ఖతార్ వేదికగా ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ మెగాటోర్నీ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు జరుగనుంది. ఈ ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మెుత్తంగా 32 జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ లో అతిథ్య జట్టు ఖతార్ ( Qatar)ఈక్వెడార్‌ను ఢీకొనబోతోంది.
మేలో ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల సీఓఏను సుప్రీంకోర్టు సోమవారం రద్దు చేయడంతో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్యపై విధించిన నిషేధాన్ని ఫిఫా ఎత్తివేసింది. దీనితో అక్టోబర్‌లో జరిగే మహిళల U-17 ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి అడ్డంకులు తొలగిపోయాయి.