Last Updated:

FIFA: ఫిఫా ప్రపంచ కప్ స్టేడియం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

ఖ‌తార్‌ వేదికగా ఫుట్ బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు జ‌రుగుతున్న‌ సంగతి తెలిసిందే. కాగా టోర్నీ జరుగుతున్న స్టేడియంకు ద‌గ్గ‌ర్లో నేడు భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదని అధికారులు తెలిపారు.

FIFA: ఫిఫా ప్రపంచ కప్ స్టేడియం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

FIFA: ఖ‌తార్‌ వేదికగా ఫుట్ బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు జ‌రుగుతున్న‌ సంగతి తెలిసిందే. కాగా టోర్నీ జరుగుతున్న స్టేడియంకు ద‌గ్గ‌ర్లో నేడు భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదని అధికారులు తెలిపారు.

సాకర్ వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న లూసెయిల్ స్టేడియం స‌మీపంలో ఆటను చూడడానికి వచ్చే విదేశీ అభిమానుల కోసం కెటాయ్‌ఫ్యాన్ ఐలాండ్ నార్త్ లో ఫ్యాన్స్ విలేజ్ ను ఏర్పాటు చేశారు. అయితే అక్క‌డికి ద‌గ్గ‌ర్లో నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఓ బిల్డింగ్‌లో శ‌నివారం ఉద‌యం అగ్ని ప్రమాదం జరిగింది. దానితో అక్కడ ద‌ట్ట‌మైన న‌ల్ల‌ని పొగ వ్యాపించింది. ప్ర‌మాదం గురించి తెలిసిన వెంట‌నే అగ్రిమాప‌క బృందాలు రంగంలోకి దిగి మంట‌ల్ని ఆర్పేశాయి. అయితే ఈ ప్ర‌మాదంలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని, ప్ర‌మాదానికి కార‌ణం ఏంట‌నేది తెలియ‌లేద‌ని అధికారులు తెలిపారు.

కెటాయ్‌ఫ్యాన్ ఐలాండ్ లో ఫిఫా ఫ్యాన్ విలేజ్‌ ను ఏర్పాటు చేశారు అందులో అభిమానుల కోసం 1,800 గుడారాలను ఏర్పాటు చేసింది ఖతార్ ప్రభుత్వం. ఒక్కో గుడారంలో రెండు సింగిల్ బెడ్స్ కేటాయించారు. కాగా ఆదివారం లూసెయిల్ స్టేడియంలో అర్జెంటీనా, మెక్సికో మ్యాచ్ జ‌ర‌గనుంది.

ఇదీ చదవండి: ఫిట్ నెస్ కోసం బుమ్రా కసరత్తులు.. వీడియో వైరల్

ఇవి కూడా చదవండి: