Last Updated:

FIFA: నోరు మూసుకుని ఫొటో.. ప్రపంచకప్ లో జర్మనీ జట్టు నిరసన

ఖతార్ వేదికగా ఫిఫా ప్రపంచకప్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జపాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్‌ ఫొటో కోసం జర్మనీ ఆటగాళ్లు వినూత్న రీతిలో ఫోజ్ ఇచ్చారు. ఫొటో తీసే ముందు ఒక్కసారిగా తమ కుడి చేతులతో నోళ్లను మూసుకున్నారు. ఎందుకిలా అనే ప్రశ్న మీకు కలిగింది కదా అయితే ఈ కథనం చూసేయ్యండి.

FIFA: నోరు మూసుకుని ఫొటో.. ప్రపంచకప్ లో జర్మనీ జట్టు నిరసన

FIFA: ఖతార్ వేదికగా ఫిఫా ప్రపంచకప్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జపాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమ్‌ ఫొటో కోసం జర్మనీ ఆటగాళ్లు వినూత్న రీతిలో ఫోజ్ ఇచ్చారు. ఫొటో తీసే ముందు ఒక్కసారిగా తమ కుడి చేతులతో నోళ్లను మూసుకున్నారు. ఎందుకిలా అనే ప్రశ్న మీకు కలిగింది కదా అయితే ఈ కథనం చూసేయ్యండి.

హరివిల్లు రంగులతో కూడిన ఆర్మ్‌ బ్యాండ్లను ఆటగాళ్లు ధరించకుండా ఫిఫా నిషేధించింది. దీనికి నిరసనగా జర్మనీ జట్టు వినూత్న రీతిలో నిరసన తెలిపింది.
జర్మనీతో సహా ఐరోపాలోని ఏడు ఫుట్‌బాల్‌ దేశాల జట్ల కెప్టెన్లు ఖతార్‌లో ప్రపంచకప్‌ సందర్భంగా వివక్షకు గురవుతున్నారు. దానిని వ్యతిరేకిస్తూ ‘‘వన్‌ లవ్‌’’తో కూడిన ఆర్మ్‌ బ్యాండ్లు ధరించాలనుకున్నారు ఐరోపా సాకర్ జట్లు. కానీ ఫిఫా అందుకు ఒప్పుకోలేదు. అలా ఎవరైనా ఆర్మ్‌ బ్యాండ్‌ ధరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు మైదానంలో వెంటనే ఎల్లో కార్డు చూపిస్తామని హెచ్చరించింది. దానితో ఆ జట్లు వెనక్కితగ్గాయి. ఖతార్‌లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా చూడడంతో పాటు అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలకు ఈ ఆర్మ్‌ బ్యాండ్లు సూచికగా ఉన్నాయి. ‘‘మానవ హక్కుల విషయంలో రాజీ ఉండకూడదు. ఇది రాజకీయ వేదిక కాదు. ఆర్మ్‌ బ్యాండ్లను నిషేధించడమంటే మాట్లాడే మా హక్కును కాదనడమే అంటూ’’అని జర్మనీ ఫుట్‌బాల్‌ సమాఖ్య  ట్వీట్‌ చేసింది.

ఇదిలా ఉండగా మ్యాచ్ విషయానికొస్తే ఫిఫాలో మరో సంచలనం నమోదైంది. గ్రూప్ – ఈలో భాగంగా జపాన్ 2-1 తేడాతో జర్మనీకి షాకిచ్చింది. నాలుగు సార్లు విశ్వ విజేతగా నిలిచిన జర్మనీకి ఆసియా జట్టు అయిన జపాన్ షాకివ్వడం గమనార్హం.

ఇదీ చదవండి: ఫిపా ప్రపంచ కప్ లో సౌదీ సంచలనం.. దేశవ్యాప్తంగా సెలవు ప్రకటన

 

ఇవి కూడా చదవండి: