Home / Chiranjeevi
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి అన్ని విషయాలను తెలుసుకున్నారు.
Chandra Mohan : నటుడు చంద్రమోహన్ తెలుగు, తమిళ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించారు . వయో భారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ ఇటీవల గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో
మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట లభించింది. 2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చిరంజీవిపై పెట్టిన కేసును ఏపీ హైకోర్ట్ కొట్టేసింది. దాదాపు 9 ఏళ్ళ క్రితం గుంటూరు, అరండల్ పేట పోలీసులు నమోదు చేసిన కేసును తాజాగా హైకోర్టు కొట్టివేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా గుంటూరు రైల్వే కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేసింది. జరిమానా విధించాలన్న
సీనియర్ దర్శకుడు కె. ప్రత్యగాత్మ కుమారుడు కె. వాసు. కృష్ణాజిల్లా ముదునూరుకు చెందిన ఆయన తండ్రి బాటలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి, ప్రేక్షకులను అలరించేలా పలు చిత్రాలు తెరకెక్కించారు.
రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో సినీ ప్రముఖులంతా పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ఆస్కార్ రావడం, రామ్ చరణ్ పుట్టినరోజు, ఉపాసన కామినేని కొణిదెల తల్లికాబోతుండడం ఇలా అన్ని కలిసి రావడంతో మెగాస్టార్ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజువేడుకల్లో రాజమౌళి, కీరవాణి, ప్రశాంత్ నీల్, వెంకటేశ్, అల్లు అరవింద్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Naatu Naatu: ఆస్కార్ అవార్డుల్లో నాటు నాటు సాంగ్ అదరగొట్టింది. ఈ పాట సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అవార్డుతో ఎన్నో ఏళ్ళ కల నెరవేరింది. ప్రపంచ సినిమాలోనే అత్యున్నత పురస్కారం.. తెలుగు సినీ పాటకు తలొంచింది. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు అవార్డు రావడంపై ప్రముఖులు స్పందించారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అనురాగ్ ఠాగూర్ ను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారు. ఈ క్రమంలో చిరంజీవి నివాసానికి కేంద్ర మంత్రి వెళ్లారు.
Chiranjeevi: నందమూరి తారకరత్న మరణవార్త తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.
Chiranjeevi: హాస్యబ్రహ్మా బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బ్రహ్మనందం పుట్టినరోజు సందర్భంగా.. మెుదట చిరంజీవి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
Success Meet: వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి చోటు చేసుకుంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు అభిమానులు వేలాది సంఖ్యలో వచ్చారు. వీరు ఒక్కసారిగా గేట్లను తోసుకొని ముందుకు వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో చిరంజీవి అభిమానులు.. పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.