Last Updated:

Chiranjeevi Comments on Award: లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుపై చిరంజీవి రియాక్షన్‌ – ఏమన్నారంటే!

Chiranjeevi Comments on Award: లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుపై చిరంజీవి రియాక్షన్‌ – ఏమన్నారంటే!

Chiranjeevi Tweet on UK Parliament Honoured Him: యూకే పార్లమెంట్‌ చిరంజీవికి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డును గురువారం ప్రదానం చేసింది. తాజాగా ఈ అవార్డుపై చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశారు. యూకే పార్లమెంట్‌లోని హౌజ్‌ ఆఫ్‌ కామన్స్‌లో చాలా మంది గౌరవనీయులైన పార్లమెంట్‌ సభ్యులు, మంత్రులు మరియు అండర్ సెక్రటరీలు, దౌత్యవేత్తల ఇచ్చిన ఈ గౌరవానికి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది

యూకే ప్రభుత్వం టీమ్‌ బ్రిడ్జ్‌ ఇండియా ద్వారా లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. “హౌజ్‌ ఆఫ్‌ కామన్‌ – యూకే పార్లమెంట్‌లో గౌరవనీయులైన పార్లమెంట్‌ సభ్యులు, మంత్రులు, దౌత్యవేత్తల మధ్య నాకు దక్కిన ఈ గౌరవంతో నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. వారి దయగల మాటలకు నన్ఉ ఆకట్టుకున్నాయి. టీమ్ బ్రిడ్జ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో హృదయపూర్వకంగా సంతోషిస్తున్నాను. నాకు దక్కిన ఈ గౌరవం గురించి చెప్పాలంటే నాకు మాటలు రావడం లేదు.

మీ అందరికి కృతజ్ఞుడిని

కానీ, నా అద్భుతమైన అభిమానులు, రక్త సంబంధమైన సోదరులు, సోదరీమణులు, నా కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు, స్నేహితులకు ప్రతిఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఈ ప్రయాణంలో అన్ని విధాలుగా నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞుడిని” అంటూ చిరు ఆనందం వ్యక్తం చేశారు. కాగా 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమాకు ఆయన అందించిన విశేష సేవలు, కృష్టిని గుర్తిస్తూ యూకే అధికార లేబర్‌ పార్టీ ఇటీవల ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో యూకే పార్లమెంట్‌ మార్చి 19న ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేసింది. ఇందులో భాగంగా లండన్‌కు వెళ్లిన చిరంజీవికి అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో భారీగా తరలి వెళ్లి అన్నయ్యకు స్వాగతం అంటూ నినాదాలు చేశారు. ఇక చిరు సినిమా విషయానికి వస్తే.. ఆరు పదుల వయసులోనూ ఆయన బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉండగానే మరో రెండు సినిమాలకు కమిట్‌ అయ్యారు.