Home / Chennai
మన దేశంలో ఆమ్ ఆద్మీ ప్రాణానికి విలువ లేదని మరోసారి రుజువైపోయింది. ఇటీవలే పూనేలో ఓ సంపన్నుడి సుపుత్రుడు పూటుగా మందుకొట్టి రూ. 2.5 కోట్లు విలువ చేసే పొర్శ్చేకారును విపరీతమైన స్పీడ్‌తో నడుపుతూ... కారు ముందు వెళ్తున్న వ్యక్తి మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు అతని స్నేహితురాలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
ఐపిఎల్ల్ ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంది.
తమిళనాడులో 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్నులింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఆమె మాజీ క్లాస్మేట్ ఆమెను గొలుసుతో కట్టి, బ్లేడ్‌తో గాయపరిచి సజీవ దహనం చేసిందని పోలీసులు తెలిపారు.చెన్నైలోని కేలంబాక్కం సమీపంలోని తలంబూర్‌లో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
మిచౌంగ్ తుఫాన్ విధ్వంసం సృష్టించినరెండు రోజుల తరువాత కూడా తమిళనాడు రాజధాని చెన్నై మరియు దాని శివారు ప్రాంతాలలో నిలిచిపోయిన నీరు మరియు విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ తీగలు నీటిలో ఉన్నందున ముందు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
మిచౌంగ్ తుఫాను కారణంగా సంభవించిన వర్షాలకు చెన్నైలో ఎనిమిది మంది మరణించారు. సోమవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లు నదులుగా మారాయి, వాహనాలు కొట్టుకుపోవడంతో విద్యాసంస్థలను మూసి వేయాల్సి వచ్చింది.
మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, నాగపట్నం, తిరువళ్లూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయింది.చెన్నైలోని చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి.
స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎలుకలు తిన్నాయని పోలీసులు పేర్కొనడంతో 22 కిలోల గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలివి.
ఒడిశా లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో క్షేమంగా బయటపడిన ప్రయాణికుల కోసం రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్ ను ఏర్పాటు చేసింది. దాదాపు 250 మంది ప్రయాణికులను ప్రత్యేక రైలులో చెన్నైకి పంపుతున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు.
చెన్నై లో ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షా కేంద్రం వద్ద పరీక్ష రాయడానికి వచ్చిన అమ్మాయిని తన బ్రా తొలగించాలంటూ నిర్వాహకులు బలవంతం చేసారని ఒక జర్నలిస్టు చేసిన ట్వీట్ సంచలనం కలిగించింది.
తమిళ ఇండస్ట్రీలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా మనోబాల రాణించారు. ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచతమే.