Home / Bathukamma
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ చివరిరోజు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలను సీఎం కేసిఆర్ తెలియచేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలందరికి అభినందనలు తెలిపారు
బతుకమ్మ పండుగ నేటితో ముగియనుంది. ఈ వేడుకల్లోని చివరి రోజు సందర్భంగా హైదరాబాద్లోని ఎల్బీస్టేడియంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్టు సిటీ పోలీసులు వెల్లడించారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే అతిపెద్ద పండుగ. ఇకపోతే ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మను చేసి పూజిస్తారు. తంగేడు, గునుగు, చామంతి, గులాబి, గుమ్మడిపూలతో బతుకమ్మను పేర్చుతారు. ఈ రోజు ప్రసాదంగా అమ్మవారికి వెన్నముద్దలను చేసి వాయనంగా పంచిపెడతారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది.
అమావాస్య నాడు మొదలయిన బతుకమ్మ పండుగను అక్టోబర్ 3 వరకు జరుపుకోనున్నారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ (బతుకమ్మ) తో ఈ పండుగ ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా బతుకమ్మను పూలతో అలంకరించి, ప్రసాదాలతో బతుకమ్మను పూజిస్తారు.
తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు మొదలు అయ్యాయి. అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు ఈ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది.
దేశ రాజధానిలో బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఏర్పడింది. ఇండియా గేట్ వద్ద అధికారికంగా బతుకమ్మ సంబరాలను చేపట్టారు. సంబరాలను వీక్షించేందుకు సాంస్కృతిక శాఖ ఎల్ ఇ డీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆహ్లాద వాతావరణాన్ని మరింత దగ్గర చేసింది
వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది.