Last Updated:

Bathukamma: ఐదో రోజు అట్ల బతుకమ్మ..

అమావాస్య నాడు మొదలయిన బతుకమ్మ పండుగను అక్టోబర్ 3 వరకు జరుపుకోనున్నారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ (బతుకమ్మ) తో ఈ పండుగ ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా బతుకమ్మను పూలతో అలంకరించి, ప్రసాదాలతో బతుకమ్మను పూజిస్తారు.

Bathukamma: ఐదో రోజు అట్ల బతుకమ్మ..

Bathukamma: వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది. అక్టోబర్ 3 వరకు ఈ బతుకమ్మ పండుగ జరుపుకోనున్నారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ (బతుకమ్మ) తో ఈ పండుగ ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా బతుకమ్మను పూలతో అలంకరించి, ప్రసాదాలతో బతుకమ్మను పూజిస్తారు. తంగేడు పూలు, గునుగు పూలు, గుమ్మడి పూలు, గోరంట్ల పూలు, పేర్చుకుంటూ, పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మను అలంకరిస్తారు. ఈ పండుగను పల్లెల్లో బాగా జరుపుకుంటారు.

నేడు 29 సెప్టెంబర్ 2022 ఐదో రోజు  అట్ల  బతుకమ్మ..

ఐదో  రోజు  అట్ల  బతుకమ్మ  పండగను జరుపుకుంటారు. ఈ  రోజు  తంగేడు పూలు, గునుగు పూలు, చామంతి పూలు, గుమ్మడి పూలతో   అలకంకరించి బతుకమ్మను పూజిస్తారు. ఈ రోజు పిండితో చేసిన  అట్లను   నైవేద్యంగా పెడతారు. అందుకే  అట్ల బతుకమ్మ అని పేరు. బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత మహిళలందరూ అట్లను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. 

ఇవి కూడా చదవండి: