Last Updated:

Bathukamma: నాలుగోవ రోజు నాన బియ్యం బతుకమ్మ 

తెలంగాణలో బతుకమ్మ పండుగ ఉత్సవాలు మొదలు అయ్యాయి. అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు ఈ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది.

Bathukamma: నాలుగోవ రోజు నాన బియ్యం బతుకమ్మ 

Bathukamma: వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలయ్యింది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది. అక్టోబర్ 3 వరకు ఈ బతుకమ్మ పండుగ జరుపుకోనున్నారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ (బతుకమ్మ) తో ఈ పండుగ ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా బతుకమ్మను పూలతో అలంకరించి, ప్రసాదాలతో బతుకమ్మను పూజిస్తారు. తంగేడు పూలు, గునుగు పూలు, గుమ్మడి పూలు, గోరంట్ల పూలు, పేర్చుకుంటూ, పసుపుతో గౌరమ్మను చేసి బతుకమ్మను అలంకరిస్తారు. ఈ పండుగను పల్లెల్లో బాగా జరుపుకుంటారు.

నేడు 27 సెప్టెంబర్ 2022 నాలుగోవ రోజు  నాన బియ్యం  బతుకమ్మ..

నాలుగోవ  రోజు నాన బియ్యం బతుకమ్మ  పండగను జరుపుకుంటారు. ఈ  రోజు  పసుపుతో  గౌరమ్మ  చేసి, తంగేడు పూలతో అలకంకరించి బతుకమ్మను పూజిస్తారు. ఈ రోజు నానబెట్టిన బియ్యాన్ని బెల్లంతో కానీ పంచదారతో కానీ ముద్దలు చేసి నైవేద్యంగా పెడతారు.  

ఇవి కూడా చదవండి: