Home / Bathukamma
ఆడపడుచులంతా పుట్టింటికి చేరుకుని కన్నులపండువగా పూలపండుగ అయిన బతుకమ్మను జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు ప్రకృతితో మమేకమై ఘనంగా బతుకమ్మలు పేర్చుతారు. ప్రతీ సాయంత్రం వాటి చుట్టూ ఆడిపాడతారు. ఈ తొమ్మిది రోజులూ అమ్మవారికి ఏ రోజు ఏఏ నైవేధ్యం సమర్పిస్తారో ఓ సారి చూసేద్దామా..
పూలు బాగా వికసించి, జలవనరులు సమృద్ధిగా ఉండే సమయంలో వచ్చే పండుగ ఈ బతుకమ్మ. భూమి నీరు ప్రకృతితో మనుషులకు ఉండే అనుబంధాన్ని ఈ పండుగ గుర్తుచేస్తుంది. ఈ సంబరాల్లో భాగంగా రోజుకో బతుకమ్మని ఆరాధించి ఆఖరి రోజు అయిన 9రోజు నీటిలో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. మరి బతుకమ్మను ఎందుకు నిమజ్జనం చెయ్యాలి? దాని వెనుకున్న రహస్యమేంటి? బతుకమ్మ నిమజ్జనంతో వచ్చే లాభాలేంటో తెలుసుకుందామా..
వర్షాకాలం ముగింపులో సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ప్రతి ఏటా ఈ పండుగ వస్తుంది. ఈ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబరు 25 నుంచి ఈ పండుగ మొదలవ్వనుంది. ప్రతి ఏడాది అమావాస్య నాడు ఈ బతుకమ్మ పండుగ మొదలవుతుంది.
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ రానున్న నేపథ్యంలో చీరల పంపిణీ మొదలుపెట్టడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. తయారైన చీరలు ఈనెల 15 నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.