Home / Assam
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సోమవారం అసోంకు చేరుకుని లఖిపూర్‌లోని ఫులెర్తాల్ సహాయ శిబిరంలో వరద బాధిత బాధితులను పరామర్శించారు. ముందగా సిల్చార్ జిల్లాలోని కుంభిగ్రామ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కడనుంచి లఖిపూర్‌లోని వరద సహాయ శిబిరానికి చేరుకున్నారు.
అసోంలో వరదలకు 56 మంది ప్రాణాలు కోల్పోగా 18 లక్షలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. అస్సాంలోని చాలా జిల్లాలకు వర్షం హెచ్చరికలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ వరద నివేదిక ప్రకారం 27 జిల్లాల్లో బుధవారం నాటికి 16.25 లక్షల మంది ప్రజలు వరదనీటిలో చిక్కుకున్నారు.
అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. భారీ వరదలకు సుమారు 15 జిల్లాల్లో 1.61 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపించింది.
రాహుల్ తన భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా సోమవారం నాడు రాష్ట్రంలోని నాగాంవ్‌లోని బటద్రవ థాన్ లో స్థానిక దేవతను దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు అధికారులు అడ్డుకున్నారు. స్థానిక ఎంపీతో పాటు ఎమ్మెల్యేలను అనుమతించారు. కానీ కాంగ్రెస్ నాయకులను మాత్రం అనుమతించలేదు.
అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో బొగ్గుతో కూడిన ట్రక్కును బస్సు ఢీకొనడంతో కనీసం 12 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు.గోలాఘాట్‌లోని డెర్గావ్ సమీపంలోని బలిజన్ ప్రాంతంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని గోలాఘాట్ ఎస్పీ రాజేన్ సింగ్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌహతి నుండి న్యూ జల్పాయ్ గురిని కలుపుతూ అస్సాం యొక్క మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ రైలు సుమారు 5 గంటల 30 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకుంటుంది
2023 చివరి నాటికి అస్సాం నుండి AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతెలిపారు.మేము 2023 చివరి నాటికి అస్సాం నుండి AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
అస్సాం ప్రభుత్వం శనివారం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్‌ను జారీ చేసింది. వారు హుందాగా ఉండే రంగుల దుస్తులు ధరించి తరగతులకు హాజరు కావాలని, సాధారణ దుస్తులను ధరించరాదని కోరింది.
అస్సాంలోని మోరిగావ్ జిల్లా మొయిరాబరి లోని శ్మశానవాటిక కమిటీ డ్రగ్స్ సేవించడం లేదా అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొనడం వల్ల మరణించిన వ్యక్తుల అంత్యక్రియలకు అనుమతించకూడదని నిర్ణయించింది.
అస్సాంలో బహుభార్యత్వంపై నిషేధం విధించడం పై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.న్యాయపరమైన అంశాలను అన్వేషించేందుకు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.