Home / Assam
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌహతి నుండి న్యూ జల్పాయ్ గురిని కలుపుతూ అస్సాం యొక్క మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ రైలు సుమారు 5 గంటల 30 నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకుంటుంది
2023 చివరి నాటికి అస్సాం నుండి AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మతెలిపారు.మేము 2023 చివరి నాటికి అస్సాం నుండి AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.
అస్సాం ప్రభుత్వం శనివారం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్‌ను జారీ చేసింది. వారు హుందాగా ఉండే రంగుల దుస్తులు ధరించి తరగతులకు హాజరు కావాలని, సాధారణ దుస్తులను ధరించరాదని కోరింది.
అస్సాంలోని మోరిగావ్ జిల్లా మొయిరాబరి లోని శ్మశానవాటిక కమిటీ డ్రగ్స్ సేవించడం లేదా అక్రమ మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొనడం వల్ల మరణించిన వ్యక్తుల అంత్యక్రియలకు అనుమతించకూడదని నిర్ణయించింది.
అస్సాంలో బహుభార్యత్వంపై నిషేధం విధించడం పై తమ ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.న్యాయపరమైన అంశాలను అన్వేషించేందుకు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌ల మధ్య 51 ఏళ్లుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదానికి ముగింపు పలికేందుకు గురువారం ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఒప్పందంపై సంతకాలు చేశారు.
: అస్సాంలోని తేయాకు తోటల కార్మికులకు షెడ్యూల్డ్ తెగల హోదా కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా అస్సాంలోని ఆదివాసీ సంఘం ఇతర వెనుకబడిన తరగతుల (OBC)తో ఒక ప్రత్యేక ఉప వర్గంలో ఉంటుంది
అస్సాం ప్రభుత్వం రైల్వే స్టేషన్లో మొట్టమొదటిసారిగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులచే పూర్తిగా నిర్వహించబడుతున్న టీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ టీ స్టాల్‌ను శుక్రవారం గౌహతి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్ వద్ద నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NEFR) జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా ప్రారంభించారు.
అస్సాంలో ఒక వ్యక్తి మరియు అతని తల్లిని చంపి, ముక్కలుగా నరికి, పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేసి, మేఘాలయకు తరలించారని పోలీసులు తెలిపారు.
.రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు అసోం ప్రభుత్వం 14 ఏళ్లలోపు బాలికలను పెళ్లి చేసుకునే పురుషులపై కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది.