Home / Andhrapradesh
6 People died in Ap and Telangana Road Accident’s: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. ఏపీ, తెలంగాణలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొని ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుపతి నుంచి అతివేగంగా వచ్చిన స్కార్పియో ఆర్టీసీ బస్సు, పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో […]
AP CM Chandrababu Pays Tribute to Ambedkar: ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలను ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుందామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్య్రోద్యమ వీరుడిగా దేశానికి ఆ మహానుభావుడు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆ మేరకు ‘ఎక్స్’లో సీఎం చంద్రబాబు పోస్టు చేశారు. దళితాభ్యుదయానికి అందరం పునరంకితమవుదామని, అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని […]
Minister Nara Lokesh : మంగళగిరిలో ఏడాదిలో 3 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంగళగిరి పేదలకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 […]
AP, Telangana Temperatures : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. 10 రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. దీంతో గొడుగులు పట్టుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంతోపాటు పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి […]
IG press meet on Pastor Praveen Pagadala Case: పాస్టర్ ప్రవీణ్ పగిడాల మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. కేసుకు సంబంధించి ఇవాళ రాజమండ్రిలో వివరాలు వెల్లడించారు. ప్రవీణ్ దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారని తెలిపారు. పలువురు సాక్షులను ప్రశ్నించి సమాచారం రాబట్టినట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని, సోషల్ మీడియాలో మాట్లాడిన వారు ఎలాంటి […]
Vontimitta : కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్టకు చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. విజయవాడ నుంచి నేరుగా కడప విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట చేరుకున్నారు. అనంతరం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేదపండితులు స్వామి వారి ప్రసాదం చంద్రబాబు దంపతులకు అందజేశారు. చంద్రబాబు దంపతులకు వేదపండితుల ఆశీర్వాదం.. అనంతరం ముఖ్యమంత్రి […]
AP CM Chandrababu : త్వరలో బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురాబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. బీసీలకు 55 కార్పొరేషన్లు పెట్టామన్నారు. బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకువచ్చామని తెలిపారు. అన్నివర్గాల కంటే మిన్నగా బీసీవర్గాలను ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం ఉద్ఘాటించారు. శుక్రవారం ఏలూరు జిల్లాలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. విదేశాల్లో చదువుకోవాలనే వారికి ఒక్కొక్కరికి రూ.15 […]
High command takes serious action against ITDP activist Kiran : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ కార్యకర్తపై టీడీపీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. భారతిపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. వీడియో వైరల్‌గా మారడంతో వైసీపీ కార్యకర్తలు కిరణ్‌ను టార్గెట్ చేసి కామెంట్లు పెడుతున్నారు. భారతిపై కిరణ్ చేసినవ్యాఖ్యలను టీడీపీ సీరియస్‌గా తీసుకుంది. భారతిపై […]
Kakani Govardhan Reddy : పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాణి దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. అన్ని విమానాశ్రయాలు, సీపోర్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు పోలీసులు అతడికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి జాడ కోసం […]
YS Jagan Allegations Against Chandrababu Naidu Government: రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం వైఎస్ జగన్ పర్యటించారు. గ్రామానికి చెందిన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబాన్ని ఓదార్చారు. అసలు దాడి ఎలా జరిగింది.. ఎంత చేశారని అడిగి తెలుసుకున్నారు. లింగమయ్య కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో బీహార్ […]