Home / Andhrapradesh
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇవాళ సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బడుగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు.. కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు […]
Property Tax Discount : ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2025 మార్చి 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే 50 శాతం వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ […]
Kakani Govardhan Reddy : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన మరో నేత చిక్కుల్లో పడ్డారు. క్వార్జ్ ఖనిజం తరలించారనే ఫిర్యాదుతో నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో లీజు ముగిసినా క్వార్జ్ తరలించారని ఆరోపణలు వచ్చాయి. మైన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రూ.250 కోట్ల విలువైన క్వార్జ్ తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకాణి సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు […]
Gorantla Butchaiah Chowdary : నియోజకవర్గాల పునర్విభజనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాన్ అంతర్గతంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్డీఏలో తాము భాగస్వామ్యంగా ఉన్నందున బహిరంగంగా మాట్లాడకూడదని చెప్పారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా క్రమశిక్షణ పాటించాయన్నారు. ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని చెప్పారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అపర గోబెల్స్‌లా మాట్లాడారని, […]
Amaravati : ఏపీలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఇవాళ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ (జీఎన్‌యూ)తో కూటమి ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో జీఎన్‌యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం అమరావతిలో అంతర్జాతీయ యూనివర్సిటీ స్థాపించడానికి జీఎన్‌యూ రూ.1,300 కోట్లు పెట్టుబడి […]
Chandrababu : ధనవంతులు, పేదలను ఒకేచోటకు చేర్చడమే లక్ష్యంగా పీ-4 విధానాన్ని రూపొందించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇందులో భాగస్వామ్యం కావడానికి ఎన్నారైలతోపాటు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావొచ్చని పేర్కొన్నారు. ఈ విధానం అమలులో అండగా నిలిచేవారిని మార్గదర్శిగా, లబ్ధిపొందే కుటుంబాలను బంగారు కుటుంబాలుగా వ్యవహరిస్తామన్నారు. పీ-4 విధానంపై ఇవాళ సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ విధానం అమలు తీరుపై చంద్రబాబు స్పష్టతనిచ్చారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు […]
Tirumala : టీటీడీ శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకోసారి సుపథం దర్శనం కల్పిస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సుపథం టికెట్ ఇచ్చి స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలను ఖాళీ చేయిస్తామని స్పష్టం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఈవో శ్యామలరావుతో కలిసి బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. బోర్డు తీర్మానాలను ఆయన వివరించారు. బోర్డు చేసిన తీర్మానాలు.. 1. ఇతర దేశాల్లో ఆలయాల […]
Araku Coffee Stalls : ఏపీలోని అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పార్లమెంట్లో ఇవాళ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్పీకర్ ఆదేశాలతో రెండు స్టాళ్ల ఏర్పాటుకు లోకసభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ అరోరా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సంగం 1, 2 కోర్టు యార్డు వద్ద స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 28 వరకు స్టాళ్ల […]
Vidadala Rajini : గుంటూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ మంత్రి విడదల రజిని ఇవాళ మీడియాతో మాట్లాడారు. తనపై అక్రమ కేసులు పెట్టించారని, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే కుట్రకు దర్శకుడని ఆరోపణలు చేశారు. ఎంపీ వ్యాపార లావాదేవీలకు సహకరించమని తనపై ఒత్తిడి తెచ్చారని, అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించారు. తనపై అక్రమ కేసులు పెట్టించి, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కుటుంబం, తన మరిదిని కూడా వివాదంలోకి […]
Botsa Satyanarayana: విశాఖలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జీవీఎంసీ మేయర్ పీఠం కోసం కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ, జనసేన పార్టీలు కలిసికట్టుగా మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి వైసీపీకి చెక్ పెట్టేందుకు ప్లాన్ వేస్తున్నాయి. ప్లాన్‌ను తిప్పికొట్టేందుకు వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ, జనసేన మేయర్‌ను పదవి నుంచి […]