Home / Andhrapradesh
Supreme Court : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌గా పనిచేసిన సంజయ్ అవినీతి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థ అధినేతలపై ఎఫ్ఐఆర్లో చేర్చారు. దీంతో సంజయ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం […]
Kakani : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు దొరకడం లేదు. ఆదివారం నెల్లూరులోని ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు తీసుకొని వెళ్లారు. ఆ సమయంలో అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. మరోవైపు హైదరాబాద్‌లో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. […]
Drought Hit Mandals : కరువు ప్రభావిత మండలాలను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా ఆరు జిల్లాల పరిధిలో 51 కరువు ప్రభావిత మండలాలు గుర్తించామని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల రాష్ట్ర విపత్తుల నిర్వహణ కార్యాలయంలో నిర్వహించిన కరువు ప్రభావ కమిటీ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖలు సమర్పించిన నివేదికలను కమిటీ పరిశీలించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు సిసోడియా […]
P4 Chandrababu : సమాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది పండుగ రోజున ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందని, అందుకే వినూత్న కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘పీ-4’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్టనర్‌షిప్‌గా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. […]
Chandrababu : ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ కార్యాలయానికీ వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదేనన్నారు. ఇవాళ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. 20 ఏళ్ల కింద ఐటీ ప్రాధాన్యత గురించి తాను చెప్పానన్నారు. తన మాట […]
Pawan Kalyan : పిఠాపురం అభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో జరుగుతున్న అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షలో కీలక సూచనలు చేశారు. నియోజకవర్గ పరిధిలో నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న […]
CM Chandrababu : తాను చెప్పిన మాటలను 30 ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గుర్తుచేయడం సంతోషం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలో ఏ ఇజం లేదు.. టూరిజం ఒక్కటేనని తాను మాట్లాడితే తీవ్ర విమర్శలు చేశారని గుర్తుచేశారు. రెండోరోజూ కలెక్టర్ల సమావేశంలో ఈ అంశాన్ని సీఎం ప్రస్తావించారు. ఈ సందర్భంగా టూరిజంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ […]
Chandrababu : క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. చాగల్లులో జరిగే క్రైస్తవ సభకు హాజరయ్యేందుకు మంగళవారం బుల్లోట్ వాహనంపై రాజమండ్రి వస్తుండగా ఘటన జరిగింది. స్థానికులు రాజమండ్రి దివాన్ చెరువు-కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ మృతదేహాన్ని నిన్న గుర్తించారు. సీఎం చంద్రబాబు విచారం.. పాస్టర్ ప్రవీణ్‌కుమార్ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఘటనపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సీఎం […]
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇవాళ సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమంపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బడుగుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు.. కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు […]
Property Tax Discount : ఆస్తి పన్ను బకాయిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పేరుకుపోయిన ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేసేందుకు ఏపీ మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్నుపై వడ్డీలో రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2025 మార్చి 31లోగా చెల్లించే బకాయిలకు మాత్రమే 50 శాతం వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ […]