Home / Andhra Pradesh
ఏపీ సీఎం జగన్‌మెహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు. అన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో అక్టోబర్ 25 నుండి ఫేస్ యాప్ హాజరును తప్పనిసరి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
పక్కా ప్లానింగ్‌తో జనసేనాని పావులు కదుపుతున్నారా? భయం తన బ్లడ్‌లో లేదని నిరూపించేందుకే ఫిక్స్ అయ్యారా? సంఖ్యాబలం కన్నా సంకల్ప బలమే గొప్పదని నిరూపించబోతున్నారా? విశాఖలో వైసీపీ నడిపిస్తున్న గర్జన రోజునే పవన్ కల్యాణ్ టూర్ ఫిక్స్ చేయడంతో ఒక్క సారిగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయి.
AP Captal issue : విశాఖ పై విష ప్రేమ
గ్రూప్-4 ప్రిలిమ్స్ ఫలితాలొచ్చేశాయ్. ఇటీవల ఏపీలో గ్రూప్-4 పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం రాత్రి విడుదల చేసింది.
విశాఖలోని రుషికొండ తవ్వకాల అంశంలో సాగతుతున్న విచారణలో ఏపి ప్రభుత్వం పై హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.విచారణ నేపథ్యంలో, ధర్మాసనం తన మాటల్లో, రుషి కొండ తవ్వకాలపై కేంద్ర అటవీ శాఖ కమిటీ వేస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారా? ప్రభుత్వం వైపు ఏదో దాచి పెడుతున్నట్లు అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రభావంతో పలు ప్రాంతాలకు ముప్పు ఏర్పడింది. ఈ క్రమంలో అనంతపురం అధికారులు నగరానికి వరద ముప్పు పొంచి ఉంది అంటూ ప్రజలను మెసేజ్ రూపంలో హెచ్చరికలు చేశారు.
చట్టాలు, మార్గదర్శకాలు, పద్ధతులను అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం గాల్లోకి వదిలేసింది. ఈ నేపథ్యంలో న్యాయస్ధానాల నుండి పలుమార్లు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగులుతోంది. ఇలాంటి పరిణామాలు ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయాయి.
తండ్రిని చంపిన చంద్రబాబుతో షోలు చేస్తున్న బాలకృష్ణకు సిగ్గుందా? అని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నాని బుధవారం గుడివాడ ఐదో వార్డు శ్రీరామపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏపీ సీఎం జగన్ బాబయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అఫ్రూవర్ మారిన డ్రైవర్ దస్తగిరి మరో మారు కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పులివెందుల నుండి కడపకు వచ్చిన దస్తగిరి తొలుత సీబీఐ అధికారులను కలసి అనంతరం ఎస్పీ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
జనసేన అధినేత. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైన్నట్లు ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు విశాఖలో మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.