Home / Andhra Pradesh
పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న శేషాచల కొండపైనున్న ధర్మ అప్పారాయ నిలయంలో అగ్ని ప్రమాదం జరిగింది.
విశాఖపట్టణంలో తనకు భూములు లేవని, తాను విశాఖలో భూములు అమ్మలేదు.. కొనలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు.
అధికార పార్టీ వైకాపా ఆగడాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో ప్రజల వైపు నుండి కూడా వైకాపా శ్రేణులకు భంగపాటు కలుగుతుంది. తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి నిరసనల సెగ తగిలింది. హిందూపురం పర్యటనలో ఆయనకు ఈ ఘటన ఎదురైంది.
అమరావతినే రాజధానిగా కోరుకుంటూ రాజధాని రైతులు తలపెట్టిన పాదయాత్ర 29వ రోజుకు చేరుకొనింది. అమరావతి నుండి అరసవళ్లి పేరుతో మహా పాదయాత్రను గత నెలలో రైతులు ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వద్ద నేటి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది
వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర"గా పేర్కొంటూ జనసేనాని తాజాగా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ను కూడా "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించాలన్నారు.
మూడు రాజధానుల మంట ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా అస్త్రాలను తెరపైకి తెస్తున్నారు వైసీపీ నేతలు.
విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్షను విధించింది. వివరాల మేరకు, నున్న ప్రాంతానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఏడేళ్ల బాలిక పై అత్యాచారం చేశాడు.
ఏపీలో 15 రోజుల పాటు స్పిన్నింగ్ మిల్లులు మూసి వేస్తున్నట్లు టెక్స్ టైల్స్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు మీడియాతో పేర్కొన్నారు. పరిశ్రమను ఆర్ధిక మాంద్యం వెంటాడుతుందని ఆవేదన వెలిబుచ్చారు.
చురుగ్గా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు. రానున్న 24 గంటల్లో రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు. భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటలు. మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ భేటీలో తాజా రాజకీయాల పై చర్చించినట్లు సమాచారం.