Home / Andhar Pradesh
కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ $600 మిలియన్ల విలువైన సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసింది మరియు అదే సంవత్సరంలో 836,000 టన్నుల మిర్చిని ఉత్పత్తి చేసింది.
లోన్ యాప్ ల వేధింపులకు గుంటూరు జిల్లాలో మరోకరు బలయ్యారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన ప్రత్యూష ఇటీవల ఇండియన్ బుల్స్, రూపి ఎక్స్ ఎమ్ రుణ యాప్ లో 20 వేలు తీసుకుంది. అయితే లోన్ తీసుకున్న తరువాత ప్రతీ నెల చెల్లింపులు చేసిన ప్రత్యూష. మరో 8వేలు చెల్లించాల్సి ఉంది.
అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పయ్యావులకు ప్రస్తుతం ఉన్న 1+1 భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పయ్యావుల గన్ మెన్లను వెనక్కు రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం బ్యారేజ్‌లో గోదావరి వరద ఉదృతి పెరిగింది. 4 లక్షల 10 వేల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి డెల్టాల నుంచి ప్రధాన పంటకాల్వలకు 6 వేల 850 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే 48 గేట్ల ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాసంలో ఏటా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 13వ తేదీతో ముగుస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు సాగుతున్నాయి. తొలిరోజు అత్యంత ఉత్సాహవంతమైన వాతావరణంలో ఫుల్ జోష్‌లో ఈ సమావేశాలు సాగాయి.
ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో కోస్తాలో ముసురు వాతావరణం నెలకొంది. ఈదురు గాలులతోపాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో రాష్ట్రంలోనే అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం