Dowleswaram Barrage: ధవళేశ్వరంబ్యారేజ్‌లో పెరుగుతున్న గోదావరి ఉదృతి
తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం బ్యారేజ్‌లో గోదావరి వరద ఉదృతి పెరిగింది. 4 లక్షల 10 వేల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి డెల్టాల నుంచి ప్రధాన పంటకాల్వలకు 6 వేల 850 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే 48 గేట్ల ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
Andhra Pradesh: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్‌లో గోదావరి వరద ఉదృతి పెరిగింది. 4 లక్షల 10 వేల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఉభయ గోదావరి డెల్టాల నుంచి ప్రధాన పంటకాల్వలకు 6 వేల 850 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే 48 గేట్ల ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ ప్రస్తుత నీటి మట్టం 6.80 అడుగులకు చేరింది.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో నీటి మట్టం 49.6 అడుగులకు చేరిందని అధికారులు తెలిపారు. దాంతో శ్రీరాం సాగర్, లక్ష్మీ బ్యారేజి, మేడిగడ్డ, సమ్మక్క బ్యారేజీల నుండి గేట్లు ఎత్తి దిగువకు వరదనీరు విడుదల చేస్తున్నారు. తాలిపేరు ప్రాజెక్టు19 గేట్లు ఎత్తి 26,152 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.