Indrakeeladri: నేటి నుంచి ఇంద్రకీలాద్రి పై శాకంబరి ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాసంలో ఏటా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 13వ తేదీతో ముగుస్తాయి.

Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాసంలో ఏటా నిర్వహించే శాకంబరి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆషాఢ శుద్ధ త్రయోదశి నుంచి ఆషాఢ పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. సోమవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 13వ తేదీతో ముగుస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు కూరగాయలను అమ్మవారికి విరాళంగా ఇస్తారు. అమ్మవారిని పూర్తిగా కూరగాయలతో అలంకరిస్తారు. మూడు రోజులపాటు అమ్మవారు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.