Last Updated:

Vinod Kambli: రూ. 30,000పెన్షన్ తో బతుకుతున్నాను. నాకు పని ఇప్పించండి.. ముంబై క్రికెట్ అసోసియేషన్ కు కాంబ్లీ రిక్వెస్ట్

ముంబై క్రికెట్ అసోసియేషన్ తనకు పని కల్పించి ఆదుకోవాలని భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కోరాడు.భారత క్రికెట్ నియంత్రణ మండలి నుండి వచ్చే పెన్షన్ ఒక్కటే తన ఆదాయ వనరు కాబట్టి క్రికెట్‌కు సంబంధించిన అసైన్‌మెంట్ల కోసం చూస్తున్నానని చెప్పాడు.

Vinod Kambli: రూ. 30,000పెన్షన్ తో బతుకుతున్నాను. నాకు పని ఇప్పించండి.. ముంబై క్రికెట్ అసోసియేషన్ కు కాంబ్లీ రిక్వెస్ట్

Mumbai: ముంబై క్రికెట్ అసోసియేషన్ తనకు పని కల్పించి ఆదుకోవాలని భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కోరాడు.భారత క్రికెట్ నియంత్రణ మండలి నుండి వచ్చే పెన్షన్ ఒక్కటే తన ఆదాయ వనరు కాబట్టి క్రికెట్‌కు సంబంధించిన అసైన్‌మెంట్ల కోసం చూస్తున్నానని చెప్పాడు. 2019 T20 ముంబై లీగ్‌లో చివరిసారిగా జట్టుకు కోచ్‌గా పనిచేసిన 50 ఏళ్ల కాంబ్లీ బిసిసిఐ నుంచి వచ్చే రూ.30,000 పెన్షన్ పై ఆధారపడి ఉన్నట్లు తెలిపాడు. కోవిడ్ అనంతరం నెరుల్‌లోని టెండూల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీలో కాంబ్లీ యువ క్రికెటర్లకు మెంటార్‌గా ఉండేవాడు.

నేను (ముంబై క్రికెట్ అసోసియేషన్) నుండి సహాయం కోరుతున్నాను ముంబై క్రికెట్ నాకు చాలా ఇచ్చింది, ఈ ఆటకు నేను నా జీవితానికి రుణపడి ఉంటాను, రిటైర్మెంట్ తర్వాత జీవితంలో స్థిరంగా ఉండాలంటే, అసైన్‌మెంట్‌లు ఉండటం ముఖ్యం. నేను ఎంసీఏ ను దాని కోసం అభ్యర్దిస్తున్నాను అంటూ కాంబ్లి తెలిపాడు. అతని చిన్ననాటి స్నేహితుడు మరియు భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు తన ఆర్థిక పరిస్థితి గురించి తెలుసా అని అడిగినప్పుడు, కాంబ్లీ ఇలా అన్నాడు. అతనికి (సచిన్) ప్రతిదీ తెలుసు, కానీ నేను అతని నుండి ఏమీ ఆశించడం లేదు. అతను నాకు టెండూల్కర్ మిడిల్‌సెక్స్ గ్లోబల్ అకాడమీ అసైన్‌మెంట్ ఇచ్చాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతను చాలా మంచి స్నేహితుడు. అతను ఎల్లప్పుడూ నాకు అండగా ఉంటాడని కాంబ్లీ పేర్కొన్నాడు.

కాంబ్లీ 104 వన్డేలు, 17 టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అతను 1991 మరియు 2000 మధ్యకాలంలో నాలుగు టెస్ట్ సెంచరీలు మరియు రెండు వన్డేసెంచరీలతో సహా ఫార్మాట్లలో 3561 పరుగులు చేశాడు

ఇవి కూడా చదవండి: