Last Updated:

IPL 2025: నేడు కీలక మ్యాచ్.. లక్నోతో పంజాబ్ కింగ్స్ ఢీ

IPL 2025: నేడు కీలక మ్యాచ్.. లక్నోతో పంజాబ్ కింగ్స్ ఢీ

Lucknow Super Giants vs Punjab Kings in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నో వేదికగా అట్టల్ బీహారి వాజ్‌పేయ్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక, ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే పంజాబ్ జట్టు విజయం సాధించి జోష్ మీద ఉండగా.. ఈ మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఖాతాల్లో రెండు పాయింట్లు వేసుకోవాలని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భావిస్తున్నారు. అలాగే లక్నో తొలి మ్యాచ్ ఓటమి చెందగా.. రెండో మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిచి రెండో విజయం తన పేరిట వేసుకోవాలని లక్నో ఆలోచిస్తుంది.

 

కాగా, ఐపీఎల్ పిచ్‌లపై లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పిచ్‌లు బ్యాటర్లతో పాటు బౌలర్లకు సమతూకంగా ఉండాలన్నారు. అయితే నేను బౌలర్ల తరఫున మాట్లాడుతున్నట్లు చెప్పారు. కొంతమంది బహిరంగంగా చెప్పకపోవచ్చని, పిచ్ పరిస్థితులపై మాట్లాడే అవకాశం కూడా రాకపోవచ్చన్నారు. ఇప్పటికే ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను చూస్తున్నామని, దీంతో ప్రతి జట్టు మరో బ్యాటర్‌ను తీసుకుంటుందన్నారు. ఇందులో ప్రధానంగా లక్ష్య ఛేదనలో ఇంపాక్ట్ ప్లేయర్ వస్తున్నారన్నారు.

 

 

అయితే, ప్రతి బౌలర్ సమతూకమైన పిచ్ ఉండాలని కోరుకుంటాడని చెప్పుకొచ్చారు. కేవలం విధ్వంసం సృష్టించేందుకు బ్యాటర్లకు మాత్రమే అనుకూలంగా పిచ్‌లు ఉండవద్దని చెప్పారు. బ్యాటింగ్, బౌలింగ్‌కు సమతూకంగా ఉండాలని, మ్యాచ్‌లో ఇద్దరికీ సమాన అవకాశాలు ఇవ్వాలని ఠాకూర్ తెలిపారు.