Coconut Oil: కొబ్బరి నూనె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందా? నిజమేంటో తెలుసుకోండి

కొబ్బరి నూనె ఆరోగ్యానికి మేలు చేస్తుందా? గుండె పనితీరకు ఆరోగ్యమా హానికరమా నిజమేంటో తెలుసుకోండి
coconut oil is good for health: భారతదేశంలో కొబ్బరినూనె అంటే తెలియని వారుండరు. ఈ నూనెను చాలా మంది తలకు పెట్టుకుంటారు. అయితే చాలా తక్కువ మొత్తంలో వంటలో వాడతారు. ఇది జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అనే విషయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొబ్బరినూనె శరీరంలో చెడు కొలస్ట్రాల్ ను పెంచుతుందా? అని ప్రజలు తరచుగా ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.
ఆసియన్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రతీక్ చౌదరి ప్రకారం కొబ్బరి నూనెలో దాదాపు 90 శాతం కొవ్వు ఉంటుంది. ఇది నెయ్యి, వెన్న కంటే ఎక్కువ. ఇందులో ఉన్నది చెడు కొలస్ట్రాల్ అని తెలిపారు. కొబ్బరినూనెను ఆహారంలో భాగం చేసినట్లయాతే ఇది ధమనుల్లో చేరి గుండె సమస్యలకు కారణమవుతుంది. దీంతో పాటే కొబ్బరినూనెలో లారిక్ ఆమ్లం ఉంటుంది. ఇదికూడా చెడు కొలస్ట్రాల్ ను పెంచుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మరియు WHO వంటి వైద్య సంస్థల ప్రకారం, చెడు కొవ్వు గుండెకు ప్రమాదకరం, అందుకే కొబ్బరి నూనెను పరిమితంగా తీసుకోవాలి లేకుంటే ఆహారంలో కొబ్బరినూనెను వాడకూడదు.
కొబ్బరి నూనెను ఉపయోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
కుటుంబపరంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు కొబ్బరినూనెను ఆహారంలో వాడకూడదు. దీనికి బదులు పల్లీ, సన్‌ఫ్లవర్, ఆలివ్ నూనె వంటి నూనెలతో వంట వండుకోవచ్చు. ముఖ్యంగా స్థానికంగా దొరికే వాటిని ముఖ్యస్థానం ఇవ్వచ్చు. ఇవి సురక్షితమైనవిగా పరిగణించబడతాయి. కొబ్బరి నూనెను ఆహారంలో కాకుండా చర్మానికి, వెంట్రుకలకు పెట్టుకోవచ్చు. బాహ్యపరమైన అన్నింటికి కొబ్బరినూనెను వాడుకోవచ్చు. ఆహారంలో మాత్రం అధికంగా ఉపయోగించకూడదు.
కొబ్బరి నూనె వలన ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. కాకపోతే అవి భాహ్య ప్రయోజనాలు అని గుర్తుంచుకోవాలి. గుండె రోగులు లేదా గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవాళ్లు కొబ్బరినూనెకు దూరంగా ఉండాలి.
గమనిక.. పైన తెలిపిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. డాక్టర్లు, నిపుణులు సలహామేరకు మాత్రమే వీటిని వినియోగించండి. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.