RCB vs KKR: కోల్ కతా భారీ స్కోర్.. బెంగళూరు లక్ష్యం 201 పరుగులు
RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌తో కోల్‌కతానైట్ రైడర్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
RCB vs KKR: కోల్ కతా భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. జేసన్ రాయ్, రాణా మెరుపులు మెరిపించారు. వెంకటేష్ అయ్యార్, రింకూ సింగ్ మంచి సహకారం అందించారు. దీంతో ఐదు వికెట్ల నష్టానికి కోల్ కతా 200 పరుగులు చేసింది.
బెంగళూరు బౌలర్లలో.. హసరంగా, విజయ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
LIVE NEWS & UPDATES
-
RCB vs KKR: కోల్ కతా భారీ స్కోర్.. బెంగళూరు లక్ష్యం 201 పరుగులు
కోల్ కతా భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. జేసన్ రాయ్, రాణా మెరుపులు మెరిపించారు. వెంకటేష్ అయ్యార్, రింకూ సింగ్ మంచి సహకారం అందించారు. దీంతో ఐదు వికెట్ల నష్టానికి కోల్ కతా 200 పరుగులు చేసింది.
బెంగళూరు బౌలర్లలో.. హసరంగా, విజయ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
-
RCB vs KKR: ఒకే ఓవర్లో రెండు వికెట్లు..
హసరంగా వేసిన ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడ్డాయి. రాణా ఔటైన వెంటనే.. అయ్యర్ కూడా క్యాచ్ ఔటయ్యాడు.
-
RCB vs KKR: భారీ స్కోర్ దిశగా కోల్ కతా..
16 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా.. 150 పరుగులు చేసింది. రాణా, అయ్యర్ ధాటిగా ఆడుతున్నారు.
-
RCB vs KKR: సిక్సర్ కొట్టిన నీతీష్ రాణా
13 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా 117 పరుగులు చేసింది. క్రీజులో రాణా, అయ్యర్ ఉన్నారు.
-
RCB vs KKR: రెండో వికెట్ డౌన్.. జేసన్ రాయ్ ఔట్
కోల్ కతా ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్ లో రాయ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాయ్ 29 బంతుల్లో 56 పరుగులు చేశాడు.
ప్రస్తుతం క్రీజులో వెంకటేష్ అయ్యార్, నీతీష్ రాణా ఉన్నారు.
-
RCB vs KKR: తొలి వికెట్ కోల్పోయిన కోల్ కతా.. జగదీశన్ ఔట్
కోల్ కతా తొలి వికెట్ కోల్పోయింది. విజయ్ కుమార్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు. జగదీశన్ 27 బంతుల్లో 29 పరుగులు చేశాడు.
-
RCB vs KKR: ముగిసిన 9వ ఓవర్.. 82 పరుగులు చేసిన కోల్ కతా
9 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా 82 పరుగులు చేసింది.
-
RCB vs KKR: అర్దసెంచరీ పూర్తి చేసుకున్న రాయ్
జేసన్ రాయ్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 22 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి.
-
RCB vs KKR: ఏడో ఓవర్లో రెండు పరుగులే..
ఏడో ఓవర్ వేసిన హసరంగా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
-
RCB vs KKR: ముగిసిన పవర్ ప్లే.. ఒకే ఓవర్లో నాలుగు సిక్సులు
పవర్ ప్లే ముగిసే సరికి కోల్ కతా 66 పరుగులు చేసింది. షాబాద్ వేసిన ఆరో ఓవర్లో జేసన్ రాయ్ నాలుగు సిక్సులు కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో మెుత్తం 25 పరుగులు వచ్చాయి.
-
RCB vs KKR: నాలుగో ఓవర్లో భారీగా పరుగులు..
డేవిడ్ విల్లీ వేసిన నాలుగో ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఇందులో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది
-
RCB vs KKR: మూడో ఓవర్లో కూడా 5 పరుగులే..
సిరాజ్ వేసిన మూడో ఓవర్లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి.
-
RCB vs KKR: రెండో ఓవర్లో 5 పరుగులు మాత్రమే..
డేవిడ్ విల్లే వేసిన రెండో ఓవర్లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి.
-
RCB vs KKR: తొలి ఓవర్.. రెండు ఫోర్లు కొట్టిన రాయ్
సిరాజ్ వేసిన తొలి ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. రాయ్ రెండు ఫోర్లు కొట్టాడు.
-
RCB vs KKR: బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా.. క్రీజులోకి జేసన్ రాయ్, జగదీశన్
మహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్ వేస్తున్నాడు.
-
RCB vs KKR: బెంగళూరు బౌలింగ్.. జట్టు ఇదే
విరాట్ కోహ్లీ(కెప్టెన్), షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేసాయి, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, విజయ్‌కుమార్ వైషాక్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.
-
RCB vs KKR: కోల్ కతా బ్యాటింగ్.. జట్టు ఇదే
ఎన్ జగదీసన్(వికెట్ కీపర్), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, వైభవ్ అరోరా, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
-
RCB vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌తో కోల్‌కతానైట్ రైడర్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.