Last Updated:

Nicholas Pooran: ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ!.. చరిత్ర సృష్టించిన పూరన్‌

Nicholas Pooran: ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారీ తీసింది. చివరి బంతికి లక్నో విజయం సాధించింది.

Nicholas Pooran: ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ!.. చరిత్ర సృష్టించిన పూరన్‌

Nicholas Pooran: ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారీ తీసింది. చివరి బంతికి లక్నో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ రికార్డ్ నమోదైంది. నికోలస్ పూరన్.. 15 బంతుల్లో అర్దసెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.

పూరన్ రికార్డ్.. (Nicholas Pooran)

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారీ తీసింది. చివరి బంతికి లక్నో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ రికార్డ్ నుమోదైంది. నికోలస్ పూరన్.. 15 బంతుల్లో అర్దసెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.

టాస్ ఓడి ముందుగా బెంగళూరు బ్యాటింగ్ కి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఆ జట్టు 212 పరుగులు చేసింది. ఫాఫ్‌ డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లి , గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ అర్ధశతకాలతో రాణించారు. అనంతరం బెంగళూరు విధించిన 213 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో తడబడింది. 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో బెంగళూరు అలవోకగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ స్టాయినిష్ చెలరేగి ఆడాడు. 30 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అయితే స్టాయినిస్ ఔటయ్యాక లక్నో గెలుపు కష్టమే అనిపించింది. కానీ సీన్ అప్పుడే రివర్స్ అయింది.

స్టాయినిస్ ఔటయ్యాక వచ్చిన పూరన్.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. కేవలం 15 బంతుల్లో అర్దసెంచరీ సాధించాడు.

ఈ 2023లో అత్యంత వేగవంతంగా హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా పూరన్‌ రికార్డు సృష్టించాడు.

కేల్‌ రాహుల్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌ తొలి స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతులు ఎదుర్కొన్న పూరన్‌ 4 ఫోర్లు, 7 సిక్స్‌లు సాయంతో 62 పరుగులు చేశాడు. ఇక విజయానికి దగ్గరలో పూరన్‌ ఔటయ్యాడు.

దీంతో మ్యాచ్‌ మళ్లీ ఆర్సీబీ వైపు మలుపు తిరిగింది.

అయితే మరో ఎండ్‌లో ఉన్న ఆయుష్‌ బదోని సమయస్పూర్తిగా ఆడుతూ.. మ్యాచ్‌ను మరింత దగ్గరగా తీసుకువెళ్లాడు.

అయితే దురదృష్టవశాత్తూ బదోని 19 ఓవర్‌లో హిట్‌ వికెట్‌గా వెనుదిరిగాడు.

దీంతో లక్నో శిబిరంలో ఉత్కంఠ మొదలైంది. ఆఖరి ఓవర్‌లో లక్నో విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే కావాలి.

బంతిని డుప్లెసిస్‌.. హర్షల్‌ పటేల్‌ చేతికి ఇచ్చాడు. క్రీజులో ఉనద్కట్‌, వుడ్‌ ఉన్నారు. తొలి బంతికి ఉనద్కట్‌ సింగిల్‌ తీశాడు.

అనంతరం రెండో బంతికి వుడ్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బిష్ణోయ్‌ మూడో బంతికి రెండు పరుగులు తీశాడు.

ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో ఒక్క వికెట్‌ తేడాతో లక్నో విజయం సాధించింది.