Last Updated:

GT vs MI: గుజరాత్ భారీ స్కోర్.. ముంబయి లక్ష్యం 208 పరుగులు

GT vs MI: ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మ‌దాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌ తో ముంబై ఇండియ‌న్స్‌ జ‌ట్టు త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

GT vs MI: గుజరాత్ భారీ స్కోర్.. ముంబయి లక్ష్యం 208 పరుగులు

గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ అర్దసెంచరీతో రాణించాడు. చివర్లో అభినవ్ మనోహోర్, మిల్లర్ దాటిగా ఆడి స్కోర్ ను పరుగులు పెట్టించారు. చివర్లో తేవాటియా సిక్సులతో విరుచుకుపడ్డాడు.

ముంబయి బౌలింగ్ లో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీసుకున్నాడు. కార్తీకేయ, మెరిడిత్, టెండూల్కర్, బెహరెండఫ్ తలో వికెట్ పడగొట్టారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 25 Apr 2023 09:19 PM (IST)

    GT vs MI: గుజరాత్ భారీ స్కోర్.. ముంబయి లక్ష్యం 208 పరుగులు

    గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ అర్దసెంచరీతో రాణించాడు. చివర్లో అభినవ్ మనోహోర్, మిల్లర్ దాటిగా ఆడి స్కోర్ ను పరుగులు పెట్టించారు. చివర్లో తేవాటియా సిక్సులతో విరుచుకుపడ్డాడు.

    ముంబయి బౌలింగ్ లో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీసుకున్నాడు. కార్తీకేయ, మెరిడిత్, టెండూల్కర్, బెహరెండఫ్ తలో వికెట్ పడగొట్టారు.

  • 25 Apr 2023 09:09 PM (IST)

    GT vs MI: 19 ఓవర్.. మూడు సిక్సులు

    19 ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో మూడు సిక్సులు బాదారు గుజరాత్ బ్యాట్స్ మెన్స్.

  • 25 Apr 2023 09:04 PM (IST)

    GT vs MI: ఐదో వికెట్ డౌన్.. మనోహర్ ఔట్

    గుజరాత్ ఐదో వికెట్ కోల్పోయింది. అభినవ్ మనోహర్ క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు.

  • 25 Apr 2023 09:01 PM (IST)

    GT vs MI: 18వ ఓవర్లో 22 పరుగులు.. మూడు సిక్సులు

    కామెరూన్ గ్రీన్ వేసిన ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. ఇందులో మూడు సిక్సులు ఉన్నాయి.

  • 25 Apr 2023 09:00 PM (IST)

    GT vs MI: 18వ ఓవర్.. వరుసగా రెండు సిక్సులు

    కామెరూన్ గ్రీన్ వేసిన ఓవర్లో వరుసగా రెండు సిక్సులు వచ్చాయి. అభినవ్ వరుసగా రెండు సిక్సులు కొట్టాడు.

  • 25 Apr 2023 08:56 PM (IST)

    GT vs MI: 17 ఓవర్లకు 150 పరుగులు

    17 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 150 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మిల్లర్, అభినవ్ ఉన్నారు. వీళ్లిద్దరు 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.

  • 25 Apr 2023 08:46 PM (IST)

    GT vs MI: 15 ఓవర్లకు గుజరాత్ 130 పరుగులు

    15 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ నాలుగు వికెట్లకు 130 పరుగులు చేసింది. పియుషీ చావ్లా వేసిన ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్సర్ వచ్చింది. క్రీజులో మిల్లర్, అభినవ్ ఉన్నారు.

  • 25 Apr 2023 08:34 PM (IST)

    GT vs MI: నాలుగో వికెట్ డౌన్.. విజయ్ శంకర్ ఔట్

    గుజరాత్ నాలుగో వికెట్ కోల్పోయింది. పియూష్ చావ్లా బౌలింగ్ లో విజయ్ శంకర్ క్యాచ్ ఔటయ్యాడు. లాంగ్ ఆన్ లో టిమ్ డేవిడ్ క్యాచ్ అందుకున్నాడు.

  • 25 Apr 2023 08:28 PM (IST)

    GT vs MI: శుభ్ మన్ గిల్ ఔట్.. మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్

    గుజరాత్ టైటాన్స్ మూడో వికెట్ కోల్పోయింది. కార్తీకేయ బౌలింగ్ లో గిల్ క్యాచ్ ఔటయ్యాడు. లాంగ్ ఆన్ లో సూర్య సింపుల్ క్యాచ్ అందుకున్నాడు. గిల్ 34 బంతుల్లో 56 పరుగులు చేశాడు.

  • 25 Apr 2023 08:21 PM (IST)

    GT vs MI: గిల్ అర్దసెంచరీ.. 10 ఓవర్లకు 84 పరుగులు

    శుభ్ మన్ గిల్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఓ సిక్సర్ ఉంది. దీంతో 10 ఓవర్లకు గుజరాత్ 84 పరుగులు చేసింది.

  • 25 Apr 2023 08:14 PM (IST)

    GT vs MI: 8 ఓవర్లో కేవలం 5 పరుగులే

    కార్తీకేయ వేసిన 8 ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయి.

  • 25 Apr 2023 08:09 PM (IST)

    GT vs MI: 7 ఓవర్లకు 55 పరుగులు

    7 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 55 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గిల్, విజయ్ శంకర్ ఉన్నారు.

  • 25 Apr 2023 08:05 PM (IST)

    GT vs MI: రెండో వికెట్ డౌన్.. హార్దీక్ పాండ్యా ఔట్

    పియుష్ చావ్లా వేసిన 7 ఓవర్లో హార్దీక్ పాండ్యా క్యాచ్ ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద సూర్య అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. పాండ్యా 14 బంతుల్లో 13 పరుగులు చేశాడు.

  • 25 Apr 2023 08:03 PM (IST)

    GT vs MI: ముగిసిన పవర్ ప్లే.. 50 పరుగులు చేసిన గుజరాత్

    పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ 50 పరుగులు చేసింది. 6 ఓవర్లో గిల్ వరుసగా రెండు ఫోర్లు ఓ సిక్సర్ కొట్టాడు. చివరి ఓవర్లో.. 17 పరుగులు వచ్చాయి.

  • 25 Apr 2023 07:52 PM (IST)

    GT vs MI: నాలుగు ఓవర్లకు గుజరాత్ 23 పరుగులు

    4 ఓవర్లు పూర్తయ్యేసరికి గుజరాత్ వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గిల్, పాండ్యా ఉన్నారు.

  • 25 Apr 2023 07:48 PM (IST)

    GT vs MI: తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాహా ఔట్

    గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో సాహా క్యాచ్ ఔటయ్యాడు. సాహా 7 బంతుల్లో 4 పరుగులు చేశాడు.

  • 25 Apr 2023 07:39 PM (IST)

    GT vs MI: రెండో ఓవర్లో 8 పరుగులు

    రెండో ఓవర్లో గుజరాత్ 8 పరుగులు చేసింది.

  • 25 Apr 2023 07:35 PM (IST)

    GT vs MI: తొలి ఓవర్.. కేవలం నాలుగు పరుగులే

    అర్జున్ టెండూల్కర్ వేసిన తొలి ఓవర్లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు.

  • 25 Apr 2023 07:30 PM (IST)

    GT vs MI: గుజరాత్ బ్యాటింగ్.. క్రీజులోకి శుభ్ మన్ గిల్, సాహా

    గుజరాత్ బ్యాటింగ్ ప్రారంభించింది. అర్జున్ టెండూల్కర్ తొలి ఓవర్ వేస్తున్నాడు.

  • 25 Apr 2023 07:12 PM (IST)

    GT vs MI: ముంబయి జట్టు ఇదే

    రోహిత్ శర్మ(కెప్టెన్‌), ఇషాన్ కిషన్(వికెట్ కీప‌ర్‌), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, అర్జున్ టెండూల్కర్, రిలే మెరెడిత్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్

  • 25 Apr 2023 07:11 PM (IST)

    GT vs MI: హర్దీక్ సేన జట్టు ఇదే

    వృద్ధిమాన్ సాహా(వికెట్ కీప‌ర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

  • 25 Apr 2023 07:11 PM (IST)

    GT vs MI: టాస్ గెలిచిన ముంబై

    టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజ‌రాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.