Published On:

IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

IPL 2025 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

IPL 2025 : 2025 ఐపీఎస్ 18వ సీజన్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో విజయంతో ముంబయి గాడిలో పడింది. కిందటి మ్యాచ్‌లో ఓడిన ఎల్‌ఎస్‌జీ ఢీలా పడింది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లలో ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి. ముఖ్యంగా ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్‌శర్మ, లఖ్‌నవూ సారథి రిషబ్ పంత్ ఫామ్ రెండు జట్లకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ పాండ్య ఫస్ట్ బౌలింగ్ ఎంచుకొని లఖ్‌నవూను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటి వరకూ రెండు జట్లు మూడు చొప్పున మ్యాచ్‌లు ఆడి ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందాయి. గాయం కారణంగా రోహిత్ శర్మ మ్యాచ్‌కి దూరమయ్యారు.

 

LSG జట్టు : మిచెల్ మార్ష్, మార్ర్కమ్, పూరన్, పంత్, మిల్లర్, బదోనీ, సమద్, దిగ్వేశ్, శార్దూల్, అవేశ్, ఆకాశ్‌దీప్ ఉన్నారు.

MI జట్టు : విల్ జేక్స్, రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధిర్, పాండ్య, రాజ్ అంగద్, శాంట్నర్, దీపక్ చాహర్, బోల్ట్, విఘ్నేశ్, అశ్వనీ ఉన్నారు.

 

ఇవి కూడా చదవండి: