Last Updated:

Delhi Capitals: రాజస్థాన్ చేతిలో దిల్లీ చిత్తు.. వరుసగా మూడో ఓటమి

Delhi Capitals: ఐపీఎల్ లో దిల్లీ క్యాపిటల్స్ ను ఓటములు వెంటాడుతున్నాయి. ఆ జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో దిల్లీ 57 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Delhi Capitals: రాజస్థాన్ చేతిలో దిల్లీ చిత్తు.. వరుసగా మూడో ఓటమి

Delhi Capitals: ఐపీఎల్ లో దిల్లీ క్యాపిటల్స్ ను ఓటములు వెంటాడుతున్నాయి. ఆ జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో దిల్లీ 57 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వార్నర్ ఒక్కడే పోరాడిన మిగతా వారి నుంచి సహకారం అందలేదు.

వార్నర్ ఒంటరి పోరాటం.. (Delhi Capitals)

ఐపీఎల్ లో దిల్లీ క్యాపిటల్స్ ను ఓటములు వెంటాడుతున్నాయి. ఆ జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో దిల్లీ 57 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వార్నర్ ఒక్కడే పోరాడిన మిగతా వారి నుంచి సహకారం అందలేదు. వార్నర్ ఒక్కడే 65 పరుగులు చేశాడు. కానీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. సాధించాల్సిన రన్ రేట్ అధికంగా పెరగడంతో.. వార్నర్ కూడా ఏం చేయలేకపోయాడు.

ట్రెంట్ బౌల్డ్ ఉగ్రరూపం..

దిల్లీ బ్యాటింగ్ లైనప్ ను ట్రెంట్ బౌల్డ్ వణికించాడు. నిప్పులు చెరిగే బంతులతో తొలి ఓవర్లనే రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఓవర్లోనే దిల్లీ ఓటమి ఖాయమైంది.

పృథ్వీ షా, మనీశ్‌ పాండే ఇద్దరిని డకౌట్ చేశాడు.
సన్ రైజర్స్ పై కూడా బౌల్డ్ ఇలాగే చెలరేగాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. యశస్వి (60), బట్లర్‌ (79) పరుగులతో రాణించారు.

వార్నర్ రికార్డు..

ఈ మ్యాచ్ లో డెవిడ్ వార్నర్ ఓ రికార్డు సాధించాడు. ఐపీఎల్ లో 6వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. వార్నర్ 165 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్ సాధించాడు.

దీంతో కోహ్లీ, ధావన్ రికార్డులను బద్దలు కొట్టాడు.
ఈ నేపథ్యంలోనే కోహ్లి, ధావన్‌ల రికార్డును బద్దలు కొట్టి ఐపీఎల్‌లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఆరువేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు.

ఇదే ఆరువేల పరుగుల మార్క్‌ అందుకోవడానికి కోహ్లి 188 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే.. శిఖర్‌ ధావన్‌ 199 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.

కానీ వార్నర్‌కు మాత్రం 165 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి.