Last Updated:

Rohit gets Emotional: మెల్ బోర్న్ స్టేడియంలో జాతీయగీతం ఆలపిస్తూ రోహిత్ తన్మయత్వం

పుట్టిన గడ్డను స్మరించుకోవడం దేశ పౌరుడిగా అందరి హక్కు. పొరుగు దేశంలో దేశంపై ఉన్న అభిమానాన్ని పంచుకొన్నాడు మన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ సంఘటన దాయాది పోరు మ్యాచ్ చోటుచేసుకొనింది. దీన్ని ఐసిసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో నెట్టింట వైరల్ అయింది.

Rohit gets Emotional: మెల్ బోర్న్ స్టేడియంలో జాతీయగీతం ఆలపిస్తూ రోహిత్ తన్మయత్వం

IND vs PAK: : పుట్టిన గడ్డను స్మరించుకోవడం దేశ పౌరుడిగా అందరి హక్కు. పొరుగు దేశంలో దేశంపై ఉన్న అభిమానాన్ని పంచుకొన్నాడు మన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ సంఘటన దాయాది పోరు మ్యాచ్ చోటుచేసుకొనింది. దీన్ని ఐసిసి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో నెట్టింట వైరల్ అయింది.

ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ క్రికెట్ మైదానం ఈ దినం ఉద్విగ్న క్షణాలకు నిలయమైంది. దాయాది దేశం పాకిస్థాన్ పోరులో భాగంగా రెండు దేశాల క్రికెట్ అభిమానులకు ఎంతో కీలకమైన ఈ టోర్నీ టీం ఇండియా కెప్టెన్ రోహిత్ భావోద్వేగానికి లోనైనాడు. మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన భారత జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో రోహిత్ శర్మ తన్మయత్వంతో ఉప్పొంగిపోయాడు. జనగణమన ముగించిన అనంతరం గుండెల నిండా ఊపిరి పీల్చుకొన్నాడు. ఆ సమయంలో అతని కళ్లు చెమర్చడం కనపడింది.

ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను కదిలించింది. ఈ భావోద్వేగాలు స్వచ్ఛమైనవిగా పేర్కొంటూ ఐసీసీ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. రెండు మిలియన్లకు పైగా లైకులను సొంతం చేసుకొన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: IND vs PAK: టీం ఇండియా టార్గెట్ @160

ఇవి కూడా చదవండి: