Last Updated:

IND vs SA 3 ODI: టీంఇండియా వర్సెస్ సఫారీల నిర్ణయాత్మక పోరు.. విజయం ఎవరిది..?

నేడు ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నిర్ణయాత్మక పోరు జరుగునుంది. తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా టీం ఇండియా రెండో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సిరీస్‌ను సమం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆఖరి వన్డే మ్యాచ్ జరుగనుంది.

IND vs SA 3 ODI: టీంఇండియా వర్సెస్ సఫారీల నిర్ణయాత్మక పోరు.. విజయం ఎవరిది..?

IND vs SA 3 ODI: నేడు ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నిర్ణయాత్మక పోరు జరుగునుంది. తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా టీం ఇండియా రెండో వన్డేలో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సిరీస్‌ను సమం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆఖరి వన్డే మ్యాచ్ జరుగనుంది.

రెండో వన్డేలో శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ పిచ్ పై విరుచుకుపడ్డారు. కాగా నేడు సొంతగడ్డపై శిఖర్‌ థావన్‌ సేనకు షాకివ్వాలని దక్షిణాఫ్రికా జట్టు ఉర్రూతలూగుతుందనే చెప్పుకోవాలి. మరి దాన్ని భారతసేన తిప్పికొడతారో లేదా బొక్కబోర్లా పడతారో వేచి చూడాల్సి ఉంది. ఇకపోతే పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ అద్భుత జోరు కొనసాగిస్తున్నాడు. కాగా కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌తో పాటు మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ కూడా రాణిస్తే టీమ్‌ఇండియాకు విజయం తథ్యం అని విశ్లేషకులు అంటున్నారు. సంజూ శాంసన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ల వల్ల టీం ఇండియా మిడిలార్డర్‌లో బలంగా ఉంది. మరోవైపు సఫారీల కెప్టెన్‌ బవుమా అనారోగ్యం వారి టీంను ఇబ్బంది పెడుతుందనే చెప్పవచ్చు. కాగా మార్క్మ్‌, క్లాసెన్‌, మిల్లర్‌, డికాక్‌, హెండ్రిక్స్‌, మలన్‌తో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ లైనప్‌ బలంగానే కనిపిస్తుంది.

ఇకపోతే గత కొద్ది రోజులుగా ఢిల్లీని వరదలు వెంటాడుతున్నాయి. కాగా ఐఎండీ మరో 2రోజుల పాటు దేశరాజధానిలో భారీవర్షాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో మరి ఈ రోజు మ్యాచ్‌ సజావుగా సాగుతుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే మంగళవారం వర్షం కురిసే అవకాశా లు కాస్త తమక్కువ ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదీ చదవండి:చరిత్ర సృష్టించిన టీంఇండియా.. ఏ దేశజట్టూ దీన్ని బీట్ చెయ్యలేదు..!

ఇవి కూడా చదవండి: