Last Updated:

1st T20: మెుదటి టీ20.. టాస్‌ గెలిచిన టీమిండియా

1st T20: రాంచీ వేదికగా జరుగుతున్న మెుదటి టి20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ తర్వాత నేడు మెుదటి టి20 జరగనుంది.

1st T20: మెుదటి టీ20.. టాస్‌ గెలిచిన టీమిండియా

1st T20: రాంచీ వేదికగా జరుగుతున్న మెుదటి టి20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ తర్వాత నేడు మెుదటి టి20 జరగనుంది.

వరుస విజయాలతో భారత్ దూసుకుపోతుంది. రెట్టించిన ఉత్సాహంతో టీ20 సిరీస్ పోరుకు సిద్ధమైంది టీమిండియా. పొట్టి క్రికెట్ లో న్యూజిలాండ్ కు మంచి రికార్డ్ ఉంది. దీంతో నేడు జరిగే పోరుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ లో రోహిత్, కోహ్లి, రాహుల్, షమి, సిరాజ్ లకు విశ్రాంతినిచ్చారు.

దీంతో హర్దిక్ పాండ్యా కెప్టెన్సీలో యువజట్టు బరిలోకి దిగుతుంది.

ఈ మ్యాచుకు కీలక ప్లేయర్లు విశ్రాంతి తీసుకోవడంతో.. కివీస్ ఎలా ప్రతిఘటిస్తుందో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కివీస్ కంటే భారత్ ఈ మ్యాచులో బలంగా కనిపిస్తుంది. కివీస్‌ తమ యువ ఆటగాళ్లతో ఈ మ్యాచులో రాణించాలని చూస్తోంది.

దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.
ఈ పొట్టి సిరీస్ లో అయినా కివీస్ రాణించాలని చూస్తోంది. భారత్ తమ చివరి టి20 మ్యాచ్ లో భారీ విజయాన్ని సాధించింది.

ఇక మ్యాచులో చోటు దక్కుతుందని ఆశించిన పృథ్వి షాకు చుక్కెదురైంది. పృథ్వితో పాటు చాహల్ కూడా బెంచ్ కే పరిమితమయ్యారు.

మెుదటి టి 20 మ్యాచ్ కు ఓపెనర్లు కీలకం కానున్నారు. ఇషాన్‌ కిషన్‌  కు తోడుగా.. శుభ్ మన్‌ గిల్‌ Shubman Gill ఆడే అవకాశం ఉంది.

సాంట్నర్‌ నాయకత్వంలో కివీస్ బరిలోకి దిగుతోంది. కెప్టెన్‌గా సాంట్నర్‌ కివీస్ కు వరుస విజయాలు అందించాడు.

గాయంతో కోలుకున్న ఇష్ సోది ఈ మ్యాచ్ ఆడటం కివీస్ కు కలిసొచ్చే అంశం.

భారత్ : హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌),ఇషాన్ కిషన్(వికెట్‌ కీపర్‌), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్

న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌),ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(వికెట్‌ కీపర్‌), మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/