Last Updated:

Movie Review : బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమా రివ్యూ

Movie Review : బొమ్మ బ్లాక్ బాస్టర్ సినిమా రివ్యూ

Cast & Crew

  • నందు (Hero)
  • యాంకర్ రష్మీ (Heroine)
  • రఘు కుంచె, కిరీటి (Cast)
  • రాజ్ విరాట్ (Director)
  • ప్రవీణ్ పగడాల ,బోస్ బాబు (Producer)
  • ప్రశాంత్ విహారి (Music)
  • సుజాత సిద్దార్ధ్ (Cinematography)
2.9

Movie Review : ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు ఉన్న క్రేజ్ పెద్ద సినిమాలకు లేదు.చిన్న కినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాలిసినవసరం లేదు.కథ బాగుంటే సినిమా ఖచ్చితంగా హిట్ టాక్ ముద్ర వేపించు.ఈ సినిమా యంగ్ డైరెక్టర్ రాజ్ విరాట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ విడుదల అయ్యాక ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేపించుకున్నాయి.ఈ సినిమా..తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.మరి “బొమ్మ బ్లాక్ బాస్టర్ ” సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!

కథ విషయానికొస్తే
మత్స్యకారుడు పోతురాజు(నందు)కి సినిమాలంటే చిన్నప్పటి పిచ్చి.డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి పోతురాజు వీరాభిమాని.తాను ఓ కథ రాసుకొని ఎలాగైనా పూరి జగన్నాథ్ కి వినిపించి ఆ సినిమా తెరకెక్కించాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. అలా అల్లర చిల్లరగా లైఫ్ ని లీడ్ చేసే క్రమంలో వాణి(రష్మీ గౌతమ్) పరిచయం అవుతుంది.. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది.ఆమె కోసం అందరితో గొడవలు కూడా పడుతుంటాడు. కట్ చేస్తే.. పోతురాజుకి తన ఫ్యామిలీ గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. దీంతో పోతురాజు లైఫ్ ఊహించని విధంగా మలుపులు తిరుగుతుంది.అప్పటినుండి పోతురాజు లైఫ్ లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.అసలు తన కుటుంభం ఏమి తెలిసింది ? వాణితో లవ్ స్టోరీ ఏమైంది? చివరికి తన సినిమా లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా? అనేది థియోటర్ కి వెళ్ళి చూడాలిసిందే.

ఫస్టాఫ్ లో హీరో పోతురాజు,వాణి మధ్య లవ్ ట్రాక్స్ .ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్స్…ఇలా వాటితో సాగింది.ఇంటర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ ఐతే బాగుంది.సెకండాఫ్లో బ్లాక్ బాస్టర్ వైపు ప్రయత్నం గట్టిగానే చేశాడు. కానీ.. టైటిల్ లో ఉన్న ఊపు కథలో లేదనే చెప్పుకోవాలి. ఇక ప్రశాంత్ విహారి పాటలు పర్వా లేదనిపించాయి.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇక హీరో నందు, యాంకర్ రష్మీ లీడ్ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.సినిమాలో మిగతా క్యారెక్టర్స్ నటీనటులు కూడా వాళ్ళ పాత్రకు న్యాయం చేశారు.

సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే
బొమ్మ అదిరింది

ఇవి కూడా చదవండి: