Last Updated:

Ravanasura Movie Review: హీరో కాదు విలన్ అన్నట్టుగా రవితేజ రావణాసుర.. మూవీ రివ్యూ ఇలా

Ravanasura Movie Review: హీరో కాదు విలన్ అన్నట్టుగా రవితేజ రావణాసుర.. మూవీ రివ్యూ ఇలా

Cast & Crew

  • రవితేజ (Hero)
  • అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ (Heroine)
  • జయరామ్, శ్రీరామ్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు (Cast)
  • సుధీర్ వర్మ (Director)
  • అభిషేక్ నామా, రవితేజ (Producer)
  • హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో (Music)
  • విజయ్ కార్తీక్ కన్నన్ (Cinematography)
3

Ravanasura Movie Review: మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. ఫస్ట్ టైం రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తుండడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ధమాకా’ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత మాస్ మహారాజ్ చేస్తున్న చిత్రం కావడం కూడా ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తుందనే చెప్పాలి. మరి ఇన్ని అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న ‘రావణాసుర’ ఎలా ఉందనే విషయం ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ: క్రిమినల్ లాయర్ కనక మహాలక్ష్మి (ఫరియా అబ్దుల్లా) దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్. ఆయన దగ్గరకు హారిక (మేఘా ఆకాష్) వచ్చి తన తండ్రి కేసు టేకప్ చేయమని అడుగుతుంది. ఆమె ఓ పెద్ద ఫార్మా కంపెనీకి సీఈవో. కొద్ది రోజులకు హారికను రేప్ చేసి మర్డర్ చేస్తారు. అంతే కాకుండా నగరంలో అటువంటి మర్డర్స్ కొన్ని జరుగుతుంటాయి. మరి వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? పోలీసులు సాకేత్ (సుశాంత్) దగ్గరకు ఎందుకు వెళతారు? అతను ఎవరు? అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాలి. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే సిటీలో కొన్ని వరుస హత్యలు జరుగుతాయి. వాటిని ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది సినిమా. ఇంకా బాగా చెప్పాలంటే ‘వాడు క్రిమినల్ లాయర్ కాదు.. లా చదివిన క్రిమినల్’ అంటూ ట్రైలర్లో చెప్పిన డైలాగులో మొత్తం కథ ఉంది.

‘రావణాసుర’ మొదట్లో తొలుత కామెడీ సీన్లు ఓకే అనిపిస్తాయి. ఆ తర్వాత ఎవరు మర్డర్ చేస్తున్నారు? అనేది తెలిసిన తర్వాత కొన్ని సీన్లను బాగా డీల్ చేశారు దర్శకుడు. అయితే.. ఒక్కటే డౌట్ కొడుతూ ఉంటుంది. అసలు సినిమాలో స్టార్టింగ్ టు ఎండింగ్.. ఎక్కడా లాజిక్స్ లేవనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత మేజర్ ట్విస్ట్ రివీల్ చేస్తుంటే.. ఇప్పటికే ఇటువంటి సినిమాలు తెలుగులో చాలా చూసేశామనే భావన వస్తుంది.ఇంక ఈ సినిమాకు భీమ్స్ అందించిన మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. విలనిజం చూపించే సన్నివేశాల్లో రీరికార్డింగ్ ఇరగదీశారు. సినిమాటోగ్రఫీ బావుంది.

ఈ సినిమాకు మెయిన్ హైలైట్ గా రవితేజ విలనిజం ఉంటుంది. సుశాంత్ పాత్రకు స్టార్టింగులో ఇచ్చిన ఇంపార్టెన్స్ తర్వాత ఉండదు. అయితే, ఆయన స్టైలింగ్ బావుంది. మేఘా ఆకాష్, అనూ ఇమ్మాన్యుయేల్, పూజితా పొన్నాడ, నవ్యా స్వామి ఓకే అనిపిస్తారు.

మాంచి యాక్షన్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించి.. ఆఖరికి ఓకే అనిపించేలా సినిమా ఉంటుంది. మొత్తాని ఈ సినిమాను ఓసారి థియేటర్లో వెళ్లి చూడవచ్చు.

ఇవి కూడా చదవండి: