Home / పొలిటికల్ వార్తలు
శాంతియుతంగా నిరసన చేయడం ప్రజల హక్కు అని వారి హక్కులను కాలరాసే విధంగా శ్రీకాళహస్తి సీఐ ప్రవర్తించడం సమంజసం కాదని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జనసేన ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకు తప్పు జరిగితే నిలచేసే హక్కు ఉంటుందని ఆయన అన్నారు
Narasaraopet Issue : ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తం గానే కొనసాగుతుంది. ఆదివారం నాడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రతిపక్ష టీడీపీ, వైసీపీ నేతల మధ్య జరిగిన కొట్లాట రాళ్లదాడికి దారి తీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరసర్పం రాళ్లు విసురుకుంటూ కర్రలతో కొట్టుకున్నారు. టీడీపీ నేత చదవాడ అరవింద్ బాబు టార్గెట్గా దాడి జరిగినట్లు ఆ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఈ ఘటనలో అరవింద్ బాబు కారు ధ్వంసం కాగా.. ఓ పోలీసు […]
జనసేన అధినేత నేడు తిరుపతికి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై దాడి చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) అంజు యాదవ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తిరుపతి జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించనున్నారు. అందుకు గాను ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి చేరుకున్నారు.
AICC in Telangana: ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలుకు సైరెన్ మోగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నారు.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా జనసేనాని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Pawan Kalyan In Tanuku: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీటెక్కిస్తోంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా ఇక మొదలుపెడదామా అంటూ స్టార్ట్ చేసిన జనసేనాని తణుకు కవి రాసిన కవితలే తనుకు ఆదర్శమని చెప్పుకొచ్చారు.
Gautam Gambhir: యమునా నది ఉద్ధృతితో ఢిల్లీ నీటమునిగింది. కాగా ఆప్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఢిల్లీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఢిల్లీ ప్రజలు మేల్కొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు తాజాగా విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె తన ఛాంబర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి.. అభినందనలు తెలియజేశారు.
జగన్.. నువ్వు చెత్త ముఖ్యమంత్రివి.. నీకు సంస్కారం లేదు.. నీకు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. వారాహి యాత్రలో భాగంగా బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విధానాలను తీవ్రంగా తప్పు బట్టారు.
ప్రస్తుతం రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా రాజ్యసభకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ వార్త పూర్తి వివరాల్లోకి వెళ్తే..