Home / పొలిటికల్ వార్తలు
ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరికి మార్చారు. అక్కడ పనిచేసే సిబ్బంది, ఇతర విభాగాలు, దస్త్రాలు, కంప్యూటర్లను కూడా మంగళగిరికి తరలించారు. పవన్‌కల్యాణ్ ఇకపై మంగళగిరిలోనే ఉంటారని పార్టీ వర్గాలు
తెదేపా నేత నారా లోకేష్.. యువగళం పాదయాత్రలో దూసుకుపోతున్నారు. ఎండా.. వాన.. అంటూ సమయాన్ని కూడా లెక్కచేయకుండా.. ప్రజలతో మమేకం అవుతూ పాదయాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ మేరకు నిన్నటితో ( ఆగస్టు 1వ తేదీ ) 172 వ రోజుకి చేరిన ఈ యాత్రలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకి వీడ్కోలు పలికి పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయ్యారు.
కొద్ది నెలల్లోనే ఎన్నికలు రానున్న తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆయన అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. వీటిలో ప్రధమంగా టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, మెట్రో విస్తరణ, ఎయిర్ పోర్టు అభివృద్ధి ఇలా అనేక కీలక
కాకినాడ జిల్లా పెద్దాపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరి హయంలో అవినీతి జరిగిందనే అంశంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ దొరబాబుల నేతలు పరస్పరం సవాళ్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ నేతలు.. లై డిటెక్టర్ టెస్టు, బహిరంగ చర్చ కోసం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. నిన్న గ్రాండ్ గా రిలీజయింది. తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సితం సినిమాకు బ్రో రీమేక్‌గా వచ్చింది.
తెదేపా మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ ఒక డేగలా తనపై కన్నేశారని ఆమె అన్నారు. ఓ పిట్టను డేగ ఎత్తుకెళ్లినట్టు తన పరిస్థితి మారిందని చెప్పారు. మోసపోయిన పిట్టను తానేనని వ్యాఖ్యానించారు. నారాయణ తనను చిత్రహింసలకు గురిచేసేవారని ఆరోపించారు.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. రాష్ట్ర సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వరుస ప్రెస్ మీట్లలో జగన్ ప్రభుత్వ వైఫల్యంపై ఆమె గళం విప్పుతూనే ఉన్నారు. ఈ మేరకు తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం లెక్కకు మిక్కిలిగా అప్పులు
వైకాపా మంత్రి జోగి రమేశ్ కి జనసేన నేతలు చుక్కలు చూపించారు. ఇటీవల జనసేన అధినేత పవన్ పై మంత్రి జోగి రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మార్చడం, తార్చడం వంటివి పవన్ కు అలవాటేనని ఆయన అన్నారు. పెళ్లాలనే కాకుండా పార్టీలను కూడా మారుస్తుంటారని విమర్శించారు. కాగా ఈ వ్యాఖ్యలను
టీటీడీ చైర్మన్ పదవి రాయలసీమలో 20 లక్షలు జనాభా ఉన్న బలిజలకు ఇవ్వాలని హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరోలేఖ రాశారు. ఇప్పటికే పలు అంశాలను లేఖల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు టీటీడీ చైర్మన్ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు. దీంతో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ కు వివిధ రూపాల్లో భర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. కొందరు ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేస్తే మరికొందరు అన్నదానం, రక్తదానం, రోగులకు పండ్ల పంపిణీ వంటివి చేస్తూ పుట్టినరోజు వేడుక జరుపుతున్నారు.