Home / పొలిటికల్ వార్తలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మరియ జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల, అతను రాబోయే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించారు.
హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో జరిగే సభకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది. పోలీసుల తీరును సవాల్ చేస్తూ బీజేపీ శ్రేణులు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. రేపు ఆర్ట్స్ కళాశాలలో బీజేపీ సభ జరగాల్సి ఉంది.
హనుమకొండ ఏసీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ సభకు అనుమతి నిరాకరించడం పై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రెమేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు కార్యాకర్తలు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి పాదయాత్రకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు బండి సంజయ్‌కి ఏసీపీ ఇచ్చిన నోటీసును హైకోర్ట్ సస్పెండ్ చేసింది. ప్రజా సంగ్రామ యాత్రపై వర్ధన్నపేట ఏసీపీ ఇచ్చిన, నోటీసును సవాల్ చేస్తూ బీజేపీ నేతలు
గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి అరెస్టయ్యారు. రాజాసింగ్ ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయనను రహస్య ప్రదేశానికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ వర్గం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రెండు రోజుల క్రితం రాజాసింగ్‌ను మంగళ్‌హాట్ పోలీసులు నాంపల్లి
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అసెంబ్లీకి అనర్హత వేటు పడే అవకాశం ఉంది. జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ దీనిపై తనకు ఎన్నికల సంఘం పంపిన నివేదికను త్వరలో ప్రకటించనున్నారు. గురువారం ఉదయం అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో జార్ఖండ్ రాజ్ భవన్‌కు పంపగా, బైస్ కాసేపట్లో అభిప్రాయాన్ని ప్రకటిస్తారు.
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేడు చంద్రబాబు నాయుడు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.
ఢిల్లీ లిక్కర్ స్కాంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రకంపణలు రేపాయి. అయితే తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కవిత కోర్టుకెక్కారు.
బీహార్ లో కొత్తగా ఏర్పాటైన మహాకూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. అసెంబ్లీలో ఇవాళ జరిగిన బలపరీక్షలో మూజువాణి ఓటుతో సీఎం నీతీశ్ కుమార్ విజయం సాధించారు. అయితే విశ్వాస పరీక్ష జరిగే సమయంలో ప్రతిపక్ష బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది.