Last Updated:

Nara Lokesh: నీ రౌడీయిజం పులివెందులలో చూపించుకో.. నారా లోకేష్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.

Nara Lokesh: నీ రౌడీయిజం పులివెందులలో చూపించుకో.. నారా లోకేష్

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పి గంతులు వేసినా చివరికి భంగపాటు తప్పదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఆయన పేదవాళ్లకు అన్నం పెట్టడు ఇతరులను పెట్టనివ్వడు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల పై వైసిపి మూకలు దాడులు చేస్తూనే ఉన్నారు అని విమర్శించారు.

ఈ రోజు కుప్పంలో చంద్రబాబు గారు ప్రారంభించబోయే అన్న క్యాంటీన్ ను వైసిపి గూండాలు ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ రౌడీయిజం పులివెందులలో చూపించుకో, కుప్పంలో కాదు జగన్ రెడ్డి. కుప్పం జోలికి వస్తే వైసిపి అల్లరిమూకల తాట తీస్తాం అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.

 

ఇవి కూడా చదవండి: