Janasena: కౌలు రైతు భరోసా వినాయకుడిగా పవన్ కళ్యాణ్
జనసైనికులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను సరికొత్తగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలురైతుల భరోసా యాత్ర జనాలను ఆలోచింపచేసింది.

Andhra Pradesh: జనసైనికులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను సరికొత్తగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలురైతుల భరోసా యాత్ర జనాలను ఆలోచింపచేసింది. మరణించిన కౌలురైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ తన స్వంత నిధులు కోట్లాది రూపాయలను అందిస్తున్నారు.
ఇదే కాన్సెప్ట్‌తో పవన్ సాయం అందిస్తున్న దృశ్యాన్ని ప్రతిబింబించేలా గణేశ్ ప్రతిమను ఏర్పాటు చేశారు జనసైనికులు. విశాఖలోని కోడిపందాల వీధిలో ఏర్పాటు చేసిన కౌలురైతుల భరోసా వినాయకుడు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాడు.