Home / పొలిటికల్ వార్తలు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు బెయిల్‌ను సుప్రీంలో ఏపీ ప్రభుత్వం సవాలు చేసింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని తాజాగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
సీఎం జగన్ మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. బటన్ నొక్కి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. మొత్తం 6,394 కోట్ల రూపాయలను డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ ఆసరా పథకంతో 79 లక్షల మంది మహిళలు లబ్ది పొందుతున్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్దికి, జనసేన పార్టీకి చాలా కీలకమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ నేపధ్యంలో ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జనసైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాస్ఠ్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపుకు అండగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి శుక్రవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసంలో ఉదయం ఆయన కలిశారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత మెుదటిసారి పవన్‌తో భేటీ అయ్యారు. జనసేనలో చేరిక ముహూర్తం, ఇతర అంశాలపై పవన్‌తో చర్చించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి ఉండవల్లిలోని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిన్నర్ చేయనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతోపాటు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. సోమవారం టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాని విడుదల చేసే అవకాశాలున్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. వివిధ నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం తీర్ధం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ రెడ్డి తెలుగుదేశంలో చేరారు. ద్వారకానాథ రెడ్డి బంధువులు విజయసాయి రెడ్డి, సునందరెడ్డి మినహా ఇతర కుటుంబ సభ్యులు తెలుగుదేశంలో చేరారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు టీడీపీలో చేరారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 4న షర్మిల కాంగ్రెస్‌లో చేరనున్నారు. 4న ఢిల్లీకి రావాల్సిందిగా షర్మిలకు ఖర్గే ఆహ్వానం పలికారు. రాహుల్, ప్రయాంక, ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. రెండు నెలల కిందట తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిల ఢిల్లీలో రాహుల్, సోనియాలతో సమావేశమయిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీని వీడి జనసేనలో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన వెంటనే వంశీకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశం ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల మార్పు అన్నది అంత ఈజీ కాదని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తనను సీఎంను చేయాలని సోనియా గాంధీ వద్దకు జగన్ వెళ్ళినప్పుడు ఆయనకు ఎదురైన అనుభవాలే ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎదురవుతున్నాయని ఉండవల్లి చెప్పారు.
రాష్ట్రంలో విధ్వంస పాలనకు జగన్ నాంది పలికారని ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిలా్ల పోలేపల్లి వద్ద బుధవారం రాత్రి యువగళం- నవశకం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.