Home / పొలిటికల్ వార్తలు
సహజ వనరుల దోపిడీలో వైసీపీ నాయకులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ నాయకుల విలువైన క్వార్ట్జ్ లాంటి ఖనిజాలను కొల్లగొడుతున్న తీరు, మైనింగ్ ముసుగులో పేదలను భయాందోళనలకు గురి చేస్తున్న తీరు విస్మయం కలిగిస్తోందన్నారు.
పుంగనూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు కనిపించకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారంటూ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆరోపించారు. పుంగనూరు మంత్రి పెద్ది రెడ్డి జాగీరా అంటూ ఆయన ప్రశ్నించారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ నెల 16నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 16వ తేదీ ఉదయం సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశమవుతారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పండిట్ జవహర్లాల్ నెహ్రూపై బుధవారం లోకసభలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. దీనిపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దులా స్పందించారు. తన తండ్రి షేక్ అబ్దుల్లా ను నెహ్రూకు జైలుకు పంపారని ... అయినా తాను నెహ్రూను నిందించను అని అన్నారు.
అత్తారింటికి దారేదో తెలిసింది కానీ.. ఏపీ రాజధానికి దారి తెలియడంలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. గురువారం సాయంత్రం విశాఖపట్నంలో జరిగిన జనసేన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని ఎక్కడుందో కేంద్రంలో ఉన్నవాళ్లు చెప్పాల్సి వస్తోందని అన్నారు. ఈ రోజుకు ఏపీకి రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి ఏందపి పవన్ మండిపడ్డారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.రేవంత్ రెడ్డితో పాటు మిగతా 11 మంది మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది.
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఖరారు చేసింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ దిల్లీలో ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా రేవంత్ రెడ్డి పేరును పార్టీ అధ్యక్షులు ఖరారు చేసారని చెప్పారు. డిసెంబర్ 7న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేస్తున్నారు. పలువురు ఓఎస్డీలు, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు గుడ్‌బై చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఆదివారం సాయంత్రం తన రాజీనామాను గవర్నర్ కు పంపిన విషయం తెలిసిందే.
ప్రగతి భవన్ పేరును ఇకపై బిఆర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మార్చుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అద్బుతమైన తీర్పు ఇచ్చారంరటూ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సచివాలయం గేట్లు ఇకపై సాధారణ ప్రజలకు కూడా తెరిచి ఉంటాయని చెప్పారు.
తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేసారు. ఆదివారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖరారవడంతో ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. సాధారణంగా ఇటువంటి సందర్బాల్లో ముఖ్యమంత్రులు గవర్నర్ ను కలిసి తమ రాజీనామా లేఖను పంపిస్తారు.