Last Updated:

Janasena Varahi : పవన్ కళ్యాణ్ జనసేన “వారాహి” మొదటి పూజకి ముహూర్తం ఫిక్స్ .. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించి ఆలయ సన్నిధిలో 'వారాహి' వాహనానికి సంప్రదాయ

Janasena Varahi : పవన్ కళ్యాణ్ జనసేన “వారాహి” మొదటి పూజకి ముహూర్తం ఫిక్స్ .. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ?

Janasena Varahi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ వార్తతో జనసైనికుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించి ఆలయ సన్నిధిలో ‘వారాహి’ వాహనానికి సంప్రదాయ పూజ జరపాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

2009లో ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అత్యంత శక్తివంతమైన విద్యుత్ తీగలు తగిలి ప్రమాదానికి గురి కాగా కొండగట్టు ఆంజనేయస్వామి కటాక్షంతోనే ప్రమాదం నుంచి బయటపడినట్లు పవన్ కళ్యాణ్ ప్రగాఢంగా విశ్వసిస్తారు.

అందువల్ల ఆయన తలపెట్టే అతి ముఖ్యమైన కార్యక్రమాలు కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభించడం శుభసూచకంగా భావిస్తారని తెలిపారు.

రాజకీయ క్షేత్ర పర్యటనల కోసం రూపొందించిన ‘వారాహి’ వాహనాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

పూజా కార్యక్రమం అనంతరం తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం అవుతారని.. రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేస్తారని పత్రికా ప్రకటన ద్వారా ప్రకటించారు.

కాగా ఇదే రోజున అనుష్టుప్ నారసింహ యాత్ర (32 నారసింహ క్షేత్రాల సందర్శం) ను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు.

ఈ యాత్రకు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నారసింహ క్షేత్రంలో పూజలు జరిపి శ్రీకారం చుడతారు. ఆ క్రమంలో మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను సందర్శిస్తారు.

ప్రభుత్వ వైఫ్యల్యాలను ఎండగడుతూ ప్రజలతో క్షేత్ర స్థాయిలో మమేకం అయ్యేందుకు బస్సు యాత్ర చేయనున్న పవన్ … తన వాహనానికి వారాహి అని నామకరణం చేసిన విషయం తెలిసిందే.

ఏపీలో వారాహి (Janasena Varahi)  రంగు గురించి జనసేన – వైకాపా నాయకుల మధ్య మాటల యుద్దమే జరిగింది.

ఈ తరుణంలో మనల్ని ఎవడ్రా ఆపేదంటూ… వారాహిని ఆపితే అప్పుడు చూపిస్తానంటూ పవన్ చెలరేగారు.

ఈనెల 12 వ తేదీన జనసేన యువశక్తి పేరిట శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కూడా వారాహిని ఆపేది ఎవరంటూ ఫైర్ అయ్యారు.

మరోవైపు ఏపీలో రోడ్ షో లను నిషేదిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

జనసేన నేత నాగబాబు, పలువురు నేతలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు.

జగన్ సర్కారు భయంతోనే పవన్ యాత్రను అడ్డుకోవడానికి ఈ జీవో జారీ చేసిందని జనసేన నేతలంతా ఆరోపిస్తున్నారు.

మరి ఈ పరిస్థితుల్లో పవన్ చేయబోయే ఈ యాత్ర గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరి ఇటీవలే హైకోర్టు జీవో 1 ని సస్పెండ్ చేస్తూ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.

ఈ తరుణంలో జగన్ సర్కారు ఈ బస్సు యాత్ర పట్ల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/