Home / inflation
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న క్యూబా ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుండి ఇంధన ధరలను ఐదు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనితో లీటర్ పెట్రోల్ ధర 25 పెసోల నుండి 132 పెసోలకు పెరుగుతుంది. ఈ చర్య దాని లోటును తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది, అయితే ఇది నగదు కొరతతో ఉన్న క్యూబన్లకు జీవితాన్ని మరింత కష్టతరం చేసే అవకాశముంది.
అనుకున్నట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రేట్లను యథావిధిగా కొనసాగించింది. మానటరీ పాలసీ కమిటీ సమావేశ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ గురువారం వెల్లడించారు.
పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. ఏకంగా 37.97 శాతానికి ఎగబాకింది. గత ఏడాది మే 2022తో పోల్చుకుంటే ఈ ఏడాది రవాణా ఖర్చులతో పాటు నాన్ పెరిషబుల్గూడ్స్ ధరల ఏకంగా 50 శాతంగాపైనే ఎగబాకాయి. గత 12 నెలల కాలానికి చూస్తే సరాసరి ద్రవ్యోల్బణం 29.16 శాతంగా నమోదయింది.
ప్రస్తుతం ఆసియాలో ద్రవ్యోల్బణం శరవేగంగా పెరుగుతున్న దేశాల్లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే శ్రీలంకను కూడా మించిపోయింది. దీనికి ప్రధాన కారణం డాలర మారకంతో స్థానిక కరెన్సీ బలహీనపడ్డంతో పాటు ఆహారం, ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దాని ప్రభావం ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణంపై పడింది.
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) ప్రకారం, మార్చి 22తో ముగిసిన వారంలో సున్నితమైన ధరల సూచిక (SPI) ఆధారంగా ద్రవ్యోల్బణం సంవత్సరానికి 47 శాతంగా నమోదయింది.