Last Updated:

Uddhav Thackeray: ప్రధాని నరేంద్ర మోదీపై ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

Uddhav Thackeray: మహారాష్ట్రలో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. శివసేన గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికే చెందుతుందని ఈసీ తీర్పు ఇవ్వడంతో.. రాష్ట్రంలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఇక ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.

Uddhav Thackeray: ప్రధాని నరేంద్ర మోదీపై ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు

Uddhav Thackeray: మహారాష్ట్రలో రోజురోజుకు రాజకీయం వేడెక్కుతోంది. శివసేన గుర్తు ఏక్ నాథ్ షిండే వర్గానికే చెందుతుందని ఈసీ తీర్పు ఇవ్వడంతో.. రాష్ట్రంలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఇక ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. కుట్రపూరితంగానే తమ పార్టీ గుర్తును చోరీ చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో భాజపాకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శివసేన పేరు, పార్టీ ఎన్నికల గుర్తు సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఘాటు విమర్శలు చేసిన ఉద్దవ్.. (Uddhav Thackeray)

కేంద్రం వ్యవహరిస్తున్న తీరు.. ఈసీ నిర్ణయంపై ఉద్దవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. కావాలనే శివసేన ఎన్నికల గుర్తును చోరీ చేశారని మండిపడ్డారు. ఈ మేరకు సీఎం ఏక్‌నాథ్‌ షిండే పై విమర్శలు చేశారు. దీనిపై మాతో శ్రీ వద్ద తన మద్దతుదారులతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగించారు. శివసేన పార్టీని చోరీ చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పాల్సి ఉందని ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే లక్ష్యంగా.. విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా.. ఏక్ నాథ్ షిండేకు సవాల్ విసిరారు. విల్లు- బాణంతో మైదానంలోకి రావాలని ఉద్ధవ్ అన్నారు. మీరు విల్లు బాణంతో వస్తే.. మేం కాగడాతో ఎదుర్కొంటాం అని ధీటుగా బదులిచ్చారు. ప్రస్తుతం ఉద్ధవ్‌ వర్గానికి ‘కాగడా’ ఎన్నికల గుర్తుగా ఉంది. గత ఏడాది అక్టోబరులో ఈసీ దీనిని కేటాయించింది. మరోవైరు.. ఉద్ధవ్ వర్గీయులు ‘మాతోశ్రీ’ వద్ద భారీ సంఖ్యలో గుమిగూడారు. ఈ క్రమంలో ఏక్‌నాథ్ షిండే కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో పర్యటించి క్యాడర్‌ను సమీకరించాలని ఠాక్రే తన శ్రేణులకు సూచించారు. ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

మోదీపై ఉద్ధవ్‌ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు..

ఎన్నికల సంఘం, ప్రధాని నరేంద్ర మోదీపై ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్‌.. కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని.. ఆరోపించారు. స్వతంత్రంగా ఉండాల్సిన సంస్థలు.. కొందరికి మద్దతుగా నిలుస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల సంఘం తీరుతో ఎవరు ఆందోళన చెందవద్దని.. రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతు ప్రభుత్వాలను కూల్చేస్తోందని ఠాక్రే వండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో భాజపా కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఈసీ నిర్ణయంపై.. త్వరలోనే సుప్రీం కోర్టుకు వెళతామని.. ఉద్ధవ్ వర్గాలు వెల్లడించాయి.