Trending News: 28 ఏళ్ల కోడలిని వివాహం చేసుకున్న 70 ఏళ్ల మామ.. ఆ కారణం గానే?
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని

Trending News : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.
కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని ఓ మామ పెళ్లాడాడు.
వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఈ మాట మాత్రం నిజం.
సాధారణంగా ఒంటరైన కోడలికి పెద్ద మనసుతో వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం లేదా అత్తింటి వారే జాగ్రత్తగా హుసుకున్న ఘటనలు మనం చూడవచ్చు.
అయితే ఇలాంటి ఘటనలు చాలా అరుదు. దీంతో ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
గ్రామానికి చెందిన కైలాశ్ యాదవ్ దంపతులకు నలుగురు సంతానం.
అందరూ వివాహాలు చేసుకుని ఎవరికి వారు జీవిస్తున్నారు. 12 ఏళ్ల క్రితం కైలాశ్ భార్య మృతి చెందింది.
కైలాశ్ యాదవ్ బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు.
జోక్యం చేసుకోలేమన్న పోలీసులు (Trending News)..
మరోవైపు, కొన్నేళ్ల క్రితం కైలాశ్ మూడో కుమారుడు మృతి చెందడంతో అతడి భార్య పూజ (28) ఒంటరిగా మారింది.
దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న కైలాశ్ (70) స్థానిక గుడిలో ఆమె నుదుట సింధూరం దిద్ది, పూల దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.
ఈ వివాహానికి పూజ తరపు బంధువులు, గ్రామస్థులు హాజరయ్యారు.
సోషల్ మీడియాలో వార్త వైరల్ అవడంతో విషయం పోలీసులకు తెలిసింది.
అయితే, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదని బర్హల్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ తెలిపారు.
ఇది ఇద్దరి వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతో కుదిరిన వివాహమని, కాబట్టి తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.
మామ కోడలని పెళ్లి చేసుకోవడం చూసి పలువురు నోరెళ్లబెడుతున్నారు.
అందులోనూ 70ఏళ్ల ముసలివాడికి 28ఏళ్ల అమ్మాయి అవసరామా అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/
ఇవి కూడా చదవండి:
- Dasara Movie: రెండు భాగాలుగా ‘దసరా’ సినిమా.. నాని చెప్పింది నిజమేనా?
- Tarakaratna Health: నిలకడగా తారకరత్న ఆరోగ్యం: బాలకృష్ణ
- Ambati Rambabu : పాదయాత్ర చేసినోడల్లా నాయకుడు కాలేడు – నారా లోకేష్ యువగళంపై అంబటి రాంబాబు